రామ్ చరణ్ చాక్లెట్ గర్ల జెనీలియా జంటగా అంజనా ప్రొడక్షన్ప్

By Sindhu

ప్రెస్టీజియస్ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా రూపొందించనున్న మెగా మూవీ ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. కె. వెంకట్రావ్ సమర్పణలో మెగాబ్రదర్ కె. నాగేంద్రబాబు నిర్మిస్తున్న చిత్రానికి బోమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రెస్టీజియస్ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 7గా ఈ క్రేజి చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్ర విశేషాలను నిర్మాత నాగేంద్రబాబు తెలియజేస్తూ 'అక్టోబర్ 21న పూజా కార్యక్రమాలతో మా చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. మా బ్యానర్ లో హైటెక్నికల్ వాల్యూస్ తో, కాంప్రమైజ్ అనే పదానికి తావివ్వకుండా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం అని తెలిపారు. ఈ చిత్రం కోసం కొంత పార్ట్ షూటింగ్ నవంబర్ నుండి ఆస్ట్రేలియా, యు.ఎస్ ఎ. లలో ప్లాన్ చేశామన్నారు. 'బొమ్మరిల్లు", పరుగు వంటి ట్రెమండస్ హిట్ చిత్రాల తర్వాత ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. అలాగే అందరి అంచనాలను మించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం 'మగధీర" తర్వాత రామ్ చరణ్ తేజ్ తో మా సంస్థ లో ఈ సినిమా చేస్తున్నాం. అందరి అంచనాలను మించే విజయాన్ని సాధించే మా చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని నమ్మశక్యంగా చెప్పగలను అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X