Ram Charan: పుట్టబోయే బిడ్డకోసం రామ్ చరణ్ క్రేజీ నిర్ణయం.. అన్నిటికీ దూరంగా..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లోనే జరుగుతోంది. అయితే చరణ్ మరోవైపు తన ఫ్యామిలీ లైఫ్ ను కూడా ఏ మాత్రం మిస్ కావడం లేదు. ప్రస్తుతం ఉపాసన గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మూడవ తరం మెగా వారాసుడి కోసం మెగాస్టార్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే పుట్టబోయే బిడ్డకోసం రామ్ చరణ్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
క్లైమాక్స్ సీన్స్ లో బిజీగా.. : గేమ్ చెంజర్ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్పిస్తూ ఉండగా సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇండియన్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకొని శంకర్ తాజాగా గేమ్ చేంజర్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ నెల ఆఖరు వరకు గేమ్ చేంజర్ షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. క్లైమాక్స్ కి సంబందించిన యాక్షన్ ఎపిసోడ్స్ ని ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నారు.

మూడు నెలల గ్యాప్ : అయితే ఈ షెడ్యూల్ తర్వాత రామ్ చరణ్ మూడు నెలలు షూటింగ్ కి విరాపం ఇవ్వనున్నారంట. నిజానికి గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ షూటింగ్ కోసం మూడు నెలల గ్యాప్ తీసుకొని మరల ఆగష్టు లేదా సెప్టెంబర్ లో స్టార్ట్ చేయాలని అనుకున్తున్నారంట.
పుట్టబోయే బిడ్డ కోసం : చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల వచ్చింది. ఈ నేపధ్యంలో భార్య డెలివరీతో పాటు ఈ మూడు నెలలు ఆమెతోనే ఉండాలని చరణ్ ఫిక్స్ అయ్యారంట. భార్య గర్భంతో ఉన్న సమయంలో భర్త తోడుగా ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. ఈ నేపధ్యంలో ఉపాసన కోరిక మన్నించి రామ్ చరణ్ ఈ మూడు నెలలు కంప్లీట్ గా ఉపాసనతోనే స్పెండ్ చేయాలని అనుకుంటున్నారంట. దీనికోసం గేమ్ చేంజర్ షూటింగ్ కి గ్యాప్ ఇస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

వచ్చే ఏడాది వేసవికి : ఇప్పటికే దిల్ రాజు కూడా ఆగష్టు, సెప్టెంబర్ లో గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తవుతుందని దిల్ రాజు కూడా చెప్పారు. ఆ తరువాత గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఎలక్షన్స్ నేపథ్యంలో జరిగే ఈ కథలో రామ్ చరణ్ మొదటి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని టాక్ అయితే వస్తోంది.
లిస్టులో మరికొన్ని : ఇక గేమ్ చేజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరొక కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై అధికారికంగా క్లారిటీ కూడా ఇచ్చేశారు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇక రామ్ చరణ్ తేజ్ లిస్టులో సుకుమార్ ప్రాజెక్టు కూడా ఉంది. ఆ ప్రాజెక్టు పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత సెట్స్ పైకి రానుంది.


Click it and Unblock the Notifications











