Acharya: మెగాస్టార్ చిరంజీవితో రామ్ చరణ్ స్క్రీన్ టైమ్.. కొద్దిసేపే అయినా ఫ్యాన్స్ కు పండగే!

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా తర్వాత వెండి తెరకు చాలా గ్యాప్ ఇచ్చారు. ఒక విధంగా కరోనా కారణంగా చాలా ఆలస్యం అయిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకోకుండా అనేక కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ పక్కా ప్రణాళికతో ఈ సినిమాను కేవలం ఏడు నెలల్లోనే ఫినిష్ చేయాలని అనుకున్నాడు. కానీ కరోనా దాటికి సినిమా చాలా సార్లు వాయిదా పడాల్సి వచ్చింది. ఇక మొత్తానికి ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులందరూ ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సిద్ధా అనే పాత్రలో అలరించబోతున్న మెగా తనయుడు తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని అనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఒక టీజర్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ కూడా చిరుత పులిలతో సమానంగా కనిపించడం ఎంతో ఆసక్తిని రేపింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని కూడా చెప్పవచ్చు.

ram charan tej screen timing with megastar in acharya

ఎందుకంటే రీసెంట్ గా రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకోవడంతో ఆచార్య సినిమాపై కూడా ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ సినిమాలో రామ్ చరణ్ తేజ్ క్యారెక్టర్ ఎంత సేపు ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో అయితే సినిమాలో 40 నిమిషాల పాటు రామ్ చరణ్ కనిపిస్తాడు అని కథనాలు వెలువడ్డాయి. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ్ క్యారెక్టర్ ఈ సినిమా కథలో తగ్గట్టుగా 25 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్యలో ఉంటుంది అని తెలుస్తోంది.

పూర్తిగా రామ్ చరణ్ తేజ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లోనే అరగంట సన్నివేశాలు ఉంటాయని సమాచారం. దర్శకుడు కొరటాల శివ కూడా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసేది దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేయడం జరిగింది. ఇక విడుదలైన పాటలకు కూడా మంచి గుర్తింపు లభించింది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ్ పాత్ర 25 నిమిషాల పాటు మాత్రమే కనిపించినప్పటికీ అభిమానులకు మాత్రం సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. మరో మొదటిసారి మెగా కలయికలో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ తేజ్ కు జోడిగా పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X