రామ్ చరణ్-శ్రీను వైట్ల మూవీ టైటిల్ ఇదేనంట!

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో శ్రీను వైట్ల చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు రాజాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.

Ram Charan Tej, Srinu Vaitla movie title confirmed

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. మెయిన్ హీరోయిన్ రోల్ కోసం ప్రణీత పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. సెకండ్ హీరోయిన్ గా రెజీనాగానీ, పూజా హెడ్గేను గానీ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.

రామ్ చరణ్ నటించిన చివరి చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే'. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆయన తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా ఉండాలని కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X