మగధీర కోసం మిత్రవింద ఫ్లైట్ ఎక్కి చెక్కేసింది...!
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ విశేషమైన కసరత్తులతో 10ప్యాక్ బాడీని పొందటానికి అమెరికాలో శిక్షణ పొందుతున్నాడు. మరి శిక్షణా కాలం పూర్తి కాకుండానే మధ్యలో జన్మదినం వచ్చేసింది. కుటుంబ సభ్యులంతా ఫోన్ లోనే అతనికి శుభాకాంక్షలు చెప్పారు అంతకన్నా ఏం చేస్తారు మరి..!
నాగబాబు, అల్లు అరవింద్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ల్లో కేక్ ని కట్ చేసి రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు వేడుకను సెలబ్రేట్ చేసుకొన్నారు. కానీ కాజల్ మాత్రం ఒక అడుగు ముందుకేసింది. పరోక్ష శుభాకాంక్షలు ఆమెకు నచ్చలేదు కాబోలు. ప్రత్యక్షంగా రామ్ చరణ్ తేజ శుభాన్ని కాంక్షించి మూడు రోజులు ముందుగానే అమెరికా వెళ్ళింది కాజల్. ఫ్లైట్ టిక్కెట్టు, ఆమెకు అక్కడ కావలసిన బస వగైరా ఏర్పాట్లన్నీ రామ్ చరణ్ చేసాడట. 'మగధీర" సినిమా తర్వాత వారిద్దరి మధ్యా ఏదో ఉందనే మాటలను అప్పట్లో పుకారుగా కొట్టిపారేసింది కాజల్. మాది కేవలం స్నేహం మాత్రమే అని కచ్చితంగా చెప్పింది. మరి ఈ సంఘటణతో స్నేహంగానే మిగులుతుందో లేక ఇంతకంటే మరేదైన గట్టి బందం ఏర్సడుతుందో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











