హిందీ ‘ఇంద్ర’రీమేక్ లో మెగా హీరోతో...
హైదరాబాద్: చిరంజీవి నటించిన 'ఇంద్ర' చిత్రం హిందీలోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అశ్వనీద్ నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ చరణ్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే జంజీర్ రీమేక్ రీలీజ్ అయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుందని సమాచారం. అయితే జంజీర్ రిజల్ట్ పైనే ఈ ప్రాజెక్టు మెటీరిలైజ్ కానుంది. దాంతో అశ్వనీదత్ ..జంజీర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రవితేజ హీరోగా పరుశరామ్ దర్శకత్వంలో సార్ వస్తారా చిత్రం నిర్మిస్తున్నారు.
ఈ విషయమై నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ మాట్లాడుతూ...ఇంద్ర రీమేక్ రైట్స్ కోసం చాలా ఆపర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పటివరకూ ఎవరకీ రైట్స్ ఇవ్వలేదు. ఈ సినిమాని మా ప్రొడక్షన్ లోనే హిందీలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు. అయితే ఎప్పుడు ఈ సినిమా మొదలవుతుంది...ఎవరితో చేస్తారు వంటి విషయాలు ఆమె మీడియాకు తెలియచేయలేదు. త్వరలో ఈ విషయమై ప్రకటన వచ్చే అవకాసముందని సమాచారం.
ఇక అప్పట్లో 'ఇంద్ర' భారీ విజయం సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని దాయి దాయి దామ్మ పాటలోని చిరంజీవి వీణ స్టెప్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. రామ్ చరణ్ మళ్లీ ఇలాంటి మ్యాజిక్ రిపీట్ చేయగలరా అనేది అందరి ముందు ఉన్న ప్రశ్న. చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించిన ఈ చిత్రాన్ని మెగా దర్శకుడు బి.గోపాల్ డెైరెక్ట్ చేయగా... మెగా చిత్రాల నిర్మాత అశ్వినీదత్ భారీ వ్యయంతో దీన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











