రామ్ చరణ్ లవ్ స్టోరీ కంటెన్యూ?

మరో ప్రక్క వి.వి.వినాయిక్ యూనిట్ వర్గాలు మాత్రం ఆ విషయాలు తమకి తెలియదని,రోజూ లేటుగా సెట్స్ కి అటెండవటం,అడిగితే సరైన సమాధానం చెప్పటం లేదని అందుకే తామే వద్దనుకుంటున్నామని అంటున్నారని సమాచారం. ఇక ఈ నేపధ్యంలో చరణ్ తన ప్రేమను కంటెన్యూ చేస్తున్నాడని అంటున్నారు. మరో ప్రక్క ఎలక్షన్స్ దగ్గరవుతున్న దశలో ఇటువంటి వార్తలు బయిటకు వస్తే ఇబ్బంది ఎదురౌతుందని ఇంట్లో వాళ్ళు రామ్ చరణ్ కి జాగ్రత్తలు చెబుతున్నారని అంటున్నారు.
ఇక ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం దరిదాపు షూటింగ్ పూర్తయినట్లే అని తెలుస్తోంది. విలన్స్ వచ్చే హెలీకాప్టర్ ని తగలపెట్టే సన్నివేశాన్ని ఈ మద్యే షూట్ చేసారు. బారీగా ఈ చిత్రం తీస్తున్నారని, అందుకు తగ్గట్లే ట్రేడ్ ఎంక్వైరీలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక చిరంజీవి,చరణ్ తో కలిపి బంగారు కోడి పెట్ట పాటలో డాన్స్ చేయటం, నాలుగు వందల సంవత్సరాల క్రిందటి వాతావరణం, గుర్రాలపై ఛేజింగ్ సీన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయని రాజమౌళి నమ్ముతున్నారు. సమ్మర్ లో ఈ సినిమా రిలీజుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











