పరుచూరి ఖైదీ-2 ప్రయత్నం ఎవరి కోసం?
మెగాస్ట్టార్ చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ" ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. చిరుకి యాక్షన్ హీరో ఇమేజ్‌నిచ్చిన ఈ చిత్రం తర్వాత చిరంజీవి వెనుదిరిగి చూసుకోలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్లు మెగాస్టార్ గా ఎదిగాడు.
కాగా...మహేష్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతుందని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవల బాహటంగా ప్రకటించారు. అయితే అది ఎంతవరకూ నిజమో తెలియకపోయినా..అదే కాన్సెప్టుతో సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్ తమ కలానికి పదును పెడుతున్నారని తెలుస్తోంది. వర్జ్యం లేని ముహూర్తం చూసి..బౌండెడ్ స్క్రిప్టుప్రతులతో చిరును కలవాలని ఈ రచయితలు యోచిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. రాజకీయాల్లో ఉన్న చిరంజీవికి సమయం చిక్కకపో యినా... 'ఖైదీ-2"గా రామ్ చరణ్‌తేజ్ తెరపైకి వచ్చే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు.
అయితే "నాన్న సినిమాలు రీమేక్ చేయను" అని రామ్ చరణ్ గతంలోనే ప్రకటించారు. నాన్నకు ఒక స్టార్ కమర్షియల్ హీరో ఇమేజ్ నిచ్చింది. అలాంటి గొప్ప సినిమాని నేను హీరోగా రీమేక్ చేయటమంటే అదొక సాహసమే అవుతుంది. అది నాకిష్టంలేదు" అని అన్నారు. నిజానికి రామ్ చరణ్ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకోవటానికి మొగ్గుచూపుతున్నాడే కానీ, తన తండ్రి హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల రీమేక్ లలో నటించాలనుకోవటం లేదు. మరి పరుచూరి ప్రయత్నం ఎవరి కోసమో, ఆయన రాసే కథలో చివరికి ఎవరు నటిస్తారో..?


Click it and Unblock the Notifications











