కరణ్ జోహార్ దర్శకత్వంలో రామ్ చరణ్?

By Bojja Kumar

హైదరాబాద్ : 'జంజీర్' చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెడుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌కు ఆ సినిమా విడుదల కాకముందే మరిన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం కుచ్ కుచ్ హోతాహై, కభి కుషి కభి ఘమ్, మైనేమ్ ఈజ్ ఖాన్ లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కరణ్ జోహార్ త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నరని తెలుస్తోంది.

ఇటీవల రామ్ చరణ్ ముంబైలోని కరణ్ జోహార్ ఆఫీసుకు వెళ్లి కలిసారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇద్దరి మధ్య సనిమా గురించిన చర్చలు సాగాయని కొందరంటున్నప్పటికీ, చరణ్ మర్యాద పూర్వకంగానే ఆయన్ను కలిసారని సన్నిహితులు అంటున్నారు.

ఏది ఏమైనా వచ్చే సంవత్సరం వీరి కాంబినేషన్లో చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అపీషియల్ స్టేట్ మెంట్ వెలువడాల్సి ఉంది. అదే నిజమైతే రామ్ చరణ్ బాలీవుడ్లో తిరుగులేని హీరోగా ఎదగడం ఖాయమని అంటున్నారు. మరి చెర్రీకి పరిస్థితులు అనుకూలించాలని, బాలీవుడ్లోనూ స్టార్ హీరోగా సత్తా చాటాలని ఆకాంక్షిద్దాం.

ప్రస్తుతం చరణ్ తన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నసంగతి తెలిసిందే. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్. ఈ చిత్రంలో రామ్ చరణ్ యాంగ్రీ యంగ్ మెన్ గా కనిపించబోతున్నాడు. వేసవిలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X