రామ్ చరణ్ కి ముంబై లో ఆ భామ కంపెనీ?
రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం జంజీర్ షూటింగ్ నిమిత్తం ముంబైలో మకాం పెట్టిన సంగతి తెలిసిందే. ఇక బెంగాళి భామ బిపాసా బసు ఇప్పుడు ముంబైలో రామ్ చరణ్ కి కంపెనీ ఇస్తుందనే వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. ఈ విషయమై అక్కడ బాలీవుడ్ పత్రికలు గత కొద్ది రోజులుగా గాసిప్స్ ప్రచురిస్తున్నాయి. ఈ విషయమై బిపాసాను ఓ పత్రిక వారు అడగ్గా ఆమె... తీసిపారేస్తూ... కేవలం రామ్ చరణ్ ప్రెండ్ మాత్రమే... మా మద్యన వేరే రిలేషన్ ఏమీ లేదు అంది. రామ్ చరణ్ మాత్రం ఈ విషయమై ఏమీ స్పందించటం లేదు.
నిజానికి గత కొంత కాలంగా దగ్గుపాటి రాణాకి, బిపాసా బసుకి మధ్య ఎఫైర్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తగినట్లే ముంబైలో డిపార్టమెంట్ షూటింగ్ కి వెళ్లిన రాణా ఆమెతో చట్టాపట్టాలు వేసుకు తిరుగుతూమీడియా కళ్లలో పడ్డారు. అయితే రానా ఆమెను.. ఇప్పుడు రామ్ చరణ్ కి పరిచయం చేసాడని, అతనికి ముంబైలో ఒక్కడూ బోర్ కొట్టకుండా ఉండటానికి కంపెనీ ఇవ్వటానికి ఆమెతో సరదాగా ఉండవచ్చనని చెప్పాడని అంటున్నారు. రామ్ చరణ్, రానా చాలా క్లోజ్ ప్రెండ్స్ కావటంతో ఇవన్నీ వీరి మధ్యన చాలా కామన్ అంటున్నారు.
ఇక రామ్ చరణ్ కి బిపాసా బసుని తొలిసారిగా... గోవాలో పరిచయంచేసారు రాణా. అక్కడికి తన ఫియాన్సీ ఉపాసనతో వచ్చిన రామ్ చరణ్ కి జంటగా బిపాసా తో కలిసి వచ్చారు రాణా. అలా తొలిసారిగా బిపాసా బసు... రామ్ చరణ్ కి మధ్య పరిచయం అయ్యింది. అక్కడే ఈ రెండు జంటలూ న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక జాన్ అబ్రహం నుంచి విడిపోయాక బిపాసా ఇప్పుడు ఒక బోయ్ ప్రెండ్ అని ఉండటం లేదని బాలీవుడ్ అంటోంది. ఆమె ఏదో స్ట్రాటజీతో టాలీవుడ్ హీరోలను దువ్వుతోందని చెప్పుకుంటున్నారు. మరి ఈ రామ్ చరణ్, బిపాసా బంధం ఎక్కడి వరకూ వెళ్తోందో... కేవలం ఆమె చెప్పినట్లుగా స్నేహంతో ఆగుతుందా అని కొందరు సందేహపడుతున్నారు.
ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే జంజీర్ చిత్రం రీమేక్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నాడు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి ఎంట్రీగా భావిస్తున్నాడు చరణ్. అందులోనూ ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా చేయటం హాట్ టాపిక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది. అందరి దృష్టి ఈ చిత్రం పైనే ఉంది. ఆయిల్ మాఫియానేపధ్యంలో దర్శకుడు ఈ స్క్రిప్టుని ఈ కాలానికి తిరిగి రాసానని చెప్తున్నారు. అమితాబ్ సైతం ఈ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇందునిమిత్తం రామ్ చరణ్ ప్రత్యేకంగా హిందీ ట్యూషన్ కి సైతం వెళ్లి కష్టపడుతున్నారు. ఈ చిత్రం హిట్టైతే అక్కడ మగధీరగా రామ్ చరణ్ దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.


Click it and Unblock the Notifications











