పవన్ తనయుడిపై రామ్ చరణ్ స్పెషల్ ఫోకస్.. ఇది నమ్మేలా ఉందా?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తే ఆ హడావుడి ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం మరో తరం వారసులు మెల్లగా టీనేజ్ వయసు దాటేస్తున్నారు. ఇక ఎక్కువగా పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనేది ఇటీవల కాలంలో కొంత హాట్ టాపిక్ గా మారింది. ఇక అతనిపై రామ్ చరణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి.

కేవలం సినిమాలతోనే కాకుండా

కేవలం సినిమాలతోనే కాకుండా

మెగాస్టార్ తమ్ముడిగా కాకుండా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడనే చెప్పాలి. కేవలం సినిమాలతోనే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా కూడా జనాల్లో మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక రాజకోయల్లోకి వెళ్లిన తరువాత పవన్ కళ్యాణ్ కొన్నాళ్లకు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

అభిమానుల బలమైన కోరిక..

అభిమానుల బలమైన కోరిక..

ఇక మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినా కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోనే ఎక్కువగానే బిజీ అవుతారని చెప్పవచ్చు. అందుకే పవన్ వారసుడు అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక దానికి తోడు రూమర్స్ కూడా అభిమానుల్లో కోరికకు మరింత బలాన్ని కలిగిస్తున్నాయి.

రామ్ చరణ్ చేతిలో అకిరా నందన్

రామ్ చరణ్ చేతిలో అకిరా నందన్

రామ్ చరణ్ తేజ్ అకిరాని సొంత ప్రొడక్షన్ లోనే వెండితెరపైకి ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్ చేసుకుంటున్నారని కొన్ని వెబ్ మీడియాలలో టాక్ వస్తోంది. సోషల్ మీడియాలలో కూడా ఓ వర్గం అభిమానులు ఈ ప్రచారాలకు మరింత బూస్ట్ ఇస్తున్నారు.అయితే ఆ రూమర్ నమ్మేలా అనిపించడం లేదు. ఇక ఇప్పట్లో ఫ్యాన్స్ కోరిక నెరవేరదనే చెప్పాలి. ఎందుకంటే అకిరా నందన్ ప్రస్తుతం 17ఏళ్ల వయసులో ఉన్నాడు.

Recommended Video

Valayam Movie Trailer Launch | Adivi Sesh
రేణు దేశాయ్ ఏమన్నారంటే..

రేణు దేశాయ్ ఏమన్నారంటే..

అకిరా ప్రస్తుతం తన ఎడ్యుకేషన్ పైనే పూర్తిగా శ్రద్దా పెట్టినట్లు తల్లి రేణు దేశాయ్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. ప్రస్తుతం యాక్టింగ్ పై కూడా అతను పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. అయినప్పటికి రూమర్స్ తగ్గడం లేదు. ఇక రామ్ చరణ్ తమ్ముడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతలు తీలుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడని చెప్పవచ్చు గాని ప్రస్తుతం వస్తున్న రూమర్స్ లో అయితే నిజం లేదని సినీ వర్గాలు నుంచి అందుతున్న సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X