RC16: రామ్ చరణ్ ట్రిపుల్ ధమాకా.. కెరీర్‌లో తొలిసారి అలాంటి ప్రయోగం
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి వచ్చినా.. హీరోకు ఉండాల్సిన అన్ని క్వాలిటీలను అలవర్చుకుని.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ఉత్సాహంతోనే అతడు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోన్నాడు. దీనికితోడు గత ఏడాదిలో వచ్చిన RRRతో రామ్ చరణ్ మరో భారీ విజయాన్ని కూడా ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో గ్లోబర్ స్టార్‌గా పేరును కూడా సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి మరింత జోష్‌తో మూవీలు లైన్‌లో పెడుతున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్‌తో 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరితో చేయడానికి ముందుకు వచ్చాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ, అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టును ఆపేశారు. అయితే, తన 16వ ప్రాజెక్టును మరో డైరెక్టర్‌తో చేయడానికి సిద్ధం అయ్యాడు.

'ఉప్పెన' చిత్రంతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపునకు తిప్పుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ తన 16వ సినిమాను చేస్తుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి ఈ చిత్రం గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతోన్నాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏకంగా మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడట. అయితే, అతడు త్రిపాత్రాభినయం చేయడం లేదట. కానీ, ముగ్గురిలా నటించి ట్విస్టులు ఇవ్వబోతున్నాడని తెలిసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరుగుతోన్నాయి.

ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











