రాంచరణ్‌తో మహేశ్.. ఇష్టమైన డైరెక్టర్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌.. సొంత ప్రొడక్షన్‌లోనే!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో నేటి తరం హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేయడం.. ఒకరి సినిమా ఫంక్షన్లకు మరొకరు వెళ్లడం.. సినిమాలు బాగుంటే అభినందించడం వంటివి ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ప్రొడ్యూసర్లుగా మారిన హీరోలు.. మిగిలిన వారితో సినిమాలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. అదే సమయంలో మల్టీస్టారర్ మూవీలకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టాప్ హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్ కలయికలో ఓ మూవీ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

 ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మక చిత్రంలో చెర్రీ

ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మక చిత్రంలో చెర్రీ

రామ్ చరణ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘RRR' (రౌద్రం రుధిరం రణం) అనే సినిమాలో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీలో చరణ్... అల్లూరిగానూ, ఎన్టీఆర్... కొమరం భీంగానూ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నాడు.

చిరంజీవి సినిమాలో చరణ్.. సస్పెన్స్

చిరంజీవి సినిమాలో చరణ్.. సస్పెన్స్

RRR తర్వాత రామ్ చరణ్ మరో సినిమాను ప్రకటించలేదు. కానీ, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య'లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ముప్పై నిమిషాల పాటు అతడు నక్సలైట్‌గా కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కరోనా కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి

చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న RRR మూవీ తర్వాత రామ్ చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి, కొరటాల శివ, కొత్త దర్శకుడు సతీష్ సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అంతేకాదు, కొన్ని స్టోరీ లైన్స్ కూడా బయటకు వచ్చాయి.

స్టైలిష్ డైరెక్టర్‌కు రామ్ చరణ్ సిగ్నల్

స్టైలిష్ డైరెక్టర్‌కు రామ్ చరణ్ సిగ్నల్

ఎన్నో ఊహాగానాలు.. మరెన్నో ప్రచారాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం... అతడు స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తాజాగా జరిగిన సమావేశంలో వంశీ చెప్పిన లైన్ అతడికి బాగా నచ్చిందని సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ‘ఎవడు' అనే మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

 మహేశ్ - రామ్ చరణ్ కాంబోలో మూవీ

మహేశ్ - రామ్ చరణ్ కాంబోలో మూవీ

రామ్ చరణ్... వంశీ పైడిపల్లి కలయికలో రాబోతున్న సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మించబోతున్నాడని కూడా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ‘జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్' బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లో అధికారికంగా వెలువడుతుందనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
మెగా సూపర్ కాంబినేషన్.. అప్పుడే

మెగా సూపర్ కాంబినేషన్.. అప్పుడే

వాస్తవానికి మహేశ్ బాబు.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. ‘ఆచార్య'లో రామ్ చరణ్ చేయాల్సిన పాత్ర మహేశ్ చేస్తున్నాడని అన్నారు. అయితే, అది వట్టి పుకారే అని తేలింది. ఇప్పుడు రామ్ చరణ్‌తో సూపర్ స్టార్ సినిమా చేస్తే ఈ రెండు కుటుంబాల అభిమానులు సంతోషంలో మునిగిపోవడం ఖాయమే.!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X