Game Changer: సీనియర్ నటుడికి చరణ్ వార్నింగ్.. పది రోజులు అదే పనిలో!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయిన అతడు.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. దీనికితోడు గత ఏడాది వచ్చిన RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో చరణ్ మరో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీనితో పాటు గ్లోబర్ స్టార్ అనే పేరును కూడా దక్కించుకున్నాడు. దీంతో ఈ మెగా హీరో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తోన్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో కలిసి 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో ఇప్పటికి దీనికి సంబంధించిన 70 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. ఇక, మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అందుకు అనుగుణంగానే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'గేమ్ చేంజర్' చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను జూన్ మొదటి వారం నుంచి మొదలుపెట్టబోతున్నారని తాజాగా ఓ న్యూస్ తెలిసింది. అంతేకాదు, ఇందులో రామ్ చరణ్‌తో పాటు ప్రముఖ నటుడు సముద్రఖని కూడా పాల్గొంటారని సమాచారం. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో వీళ్లిద్దరి మధ్య ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు వార్నింగ్ సీన్‌ను షూట్ చేయబోతున్నారని తెలిసింది. ఈ సీన్ సినిమాలో ఎంతో హైలైట్ కాబోతుందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోతూనే ఉన్నాయి.

భారీ బడ్జెట్‌తో వస్తున్న 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











