RamCharan కీలక నిర్ణయం.. పెద్ద ప్లానే సిద్దం.. ఆ ఓటీటీకి అంబాసిడర్ గా!

తెలుగు భాష మీద దాదాపు అన్ని ఓటీటీ సంస్థలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి.. ఏకంగా అల్లు అరవింద్ అయితే తెలుగులో మొట్టమొదటి ఓటీటీ అంటూ ఆహా సంస్థను నెలకొల్పిన సంగతి కూడా తెలిసిందే.. ఇప్పుడు అదే కోవలో ఒక అంతర్జాతీయ సంస్థ తెలుగు కంటెంట్ మీద ఫోకస్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

అందుకే తెలుగు మీద ఫోకస్

అందుకే తెలుగు మీద ఫోకస్

తెలుగు మార్కెట్ పెద్దది కావడంతో దాదాపు అన్ని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటి నుండి ప్రత్యేకమైన తెలుగు కంటెంట్‌ని తీసుకురావాలని యోచిస్తున్నాయి. ఆ అంతే కాక ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు తమ తమ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రైబ్ అయ్యేలా చూడాలని వారు అనేక ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే సిద్దం

ఇప్పటికే సిద్దం


ఇక ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్‌ఫ్లిక్స్ సంస్థలు బాగా ప్రాచూర్యం పొందాయి, ఒకరకంగా అవి రెండే ఆధిపత్యం చెలాయించడంతో, ఇప్పటికే తెలుగు OTT ఆహా వారి యాప్‌ను ప్రమోట్ చేయడానికి అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండలను ఇప్పటికే లైన్ లో పెట్టింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరో న్యూస్ అయితే హాట్ టాపిక్ గా మారింది.

ఏకంగా మూడు కోట్లు

ఏకంగా మూడు కోట్లు

టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు డిస్నీ+హాట్‌స్టార్ తెలుగు వెర్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా హీరో రామ్ చరణ్ ఎంపికయ్యారని, ఇప్పటికే దీనికి సంబంధించిన డీలింగ్స్ అన్నీ అయ్యాయని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ తో మరింత క్రేజ్ సంపాదించబోతున్న ఈ స్టార్‌ని రెండు వీడియో యాడ్స్ మరియు ప్రింట్ యాడ్స్‌లో కనిపించడానికి ఏకంగా ₹ 3 కోట్లు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

గట్టి ప్లానే

గట్టి ప్లానే

ఇక ఈ డీల్ ఒక సంవత్సరం పాటు కొనసాగినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో చరణ్ కారణంగా తమ యాప్ కు సభ్యులుగా మారడానికి మిలియన్ల మంది చందాదారులు ఆకర్షితులవుతారని హాట్‌స్టార్ నిర్వహకులు అంచనా వేస్తున్నారు.అలాగే, హాట్‌స్టార్ ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్‌లు మరియు చలనచిత్రాలతో సహా అనేక తెలుగు ఒరిజినల్స్ రూపొందించడంపై దృష్టి సారించింది.

తెలివైన పనే

తెలివైన పనే


ఇక ఆర్ ఆర్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా విడుదలకు సిద్దమవుతున్న సమయంలో చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేర్చడంతో, OTT వైపు ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఇది ఖచ్చితంగా ఒక తెలివైన మార్కెటింగ్ చర్య అవుతుందని అంటున్నారు. మరి గ్లోబల్ డిజిటల్ కంటెంట్ దిగ్గజం అయిన ఈ డిస్నీ హాట్ స్టార్ కోసం ఇది ఎలా పని చేస్తుందో చూడాల్సి ఉంది.

Recommended Video

Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే


ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావలసి ఉండగా అఫీషియల్ గా వాయిదా వేశారు. మరో పక్క తండ్రి ఆచార్య సినిమాలో, ఆలాగే శంకర్ తో మరో సినిమా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X