»   » రామ్ చరణ్ ‘మెరుపు’కల కాదు ‘మెరుపు’ దాడి..

రామ్ చరణ్ ‘మెరుపు’కల కాదు ‘మెరుపు’ దాడి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ కెరీర్ ఆరెంజ్ సినిమాతో షార్స్ మలుపు తీసుకోబోతోంది అని నాగబాబు అంటుంటే ఏంటో అర్థం కాలేదు గానీ ఇప్పుడు బుడ్డ మెగాస్టార్ పడుతున్న కష్టాలు చూస్తుంటే మెగా కుటుంబం మొత్తం 'అయ్యో పాపం" అంటుందట. భయంకరమైన ఆరెంజ్ తర్వాత మొదలైన రామ్ చరణ్ 'మెరుపు" కల నెరవేరటానికి ఎన్నో అడ్డంకులు ముందు పడుతుండటంతో అసలు ఈ సినిమా విడుదల సాధ్యమేనా? అనిపిస్తోంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మెరుపు చిత్ర కథ, స్ర్కిప్ట్ నచ్చట్లేదని చరణ్ బాబు ఇప్పుడు దర్శకుడు ధరణి ని ముప్పు తిప్పలు పెడుతున్నాడట.

ఓ షెడ్యూల్ అయిపోయాక మళ్లీ మొదటి నుండి తీయటం అంటే మాకు పెద్ద బొక్క అని నిర్మాత చౌదరి గారు చీర చుట్టేయటం, మరోపక్క ధరణి బిక్కమొహం వేసుకోవటం, ఇవేవీ చాలక ఆస్ట్రేలియా కోచ్ అంటూ చరణ్ ఫుట్ బాల్ ఆడుకోవటం చూసి చిర్రెత్తుకొచ్చిన కాజల్ సినిమా నుండి పారిపోవటం చూస్తుంటే, చచ్చీ చెడీ సినిమా ఓ సంవత్సరం తరువాత విడుదలైనా ఇది మెరుపు కల కాదు గానీ ప్రేక్షకుల మీద మెరుపు దాడి అని మాత్రం ఖచ్చితంగా చేస్తుందంటున్నారు అభిమానులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu