మాటల మాంత్రికుడితో మొదటిసారి రామ్ చరణ్ మూవీ.. మొదలయ్యేది ఎప్పుడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కరోనా భారిన పడిన విషయంతెలిసిందే. అయితే కొన్నిరోజులకే మళ్ళీ కోలుకున్న చరణ్ వెంటనే ఆచార్య షూటింగ్ కోసం రెడీ అయ్యాడు.కరోనా వల్ల RRRకు సంబంధించిన షెడ్యూల్ ప్లానింగ్ లలో మళ్ళీ మార్పులు చేయక తప్పలేదు. అయితే ఆ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా అనంతరం రామ్ చరణ్ ఏ దర్శకుడితో వర్క్ చేస్తారు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు.

ఒక్క ఎనౌన్స్మెంట్ కూడా రాలేదు

ఒక్క ఎనౌన్స్మెంట్ కూడా రాలేదు

RRR నటుడు ఎన్టీఆర్ అయితే త్రివిక్రమ్ తో ఎప్పుడో ఒక సినిమా సెట్ చేసుకున్నాడు. మరోవైపు దర్శకుడు రాజమౌళి కూడా లాక్ డౌన్ లో మహేష్ కోసం ఒక ప్రాజెక్టును అయితే ప్లాన్ చేసుకున్నాడు. కానీ రామ్ చరణ్ ఇంకా ఒక్క ప్రాజెక్టును కూడా ఎనౌన్స్ చేయలేదు. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ మరో సీనియర్ స్టార్ డైరెక్టర్ తో చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

 జెర్సీ దర్శకుడితో చర్చలు

జెర్సీ దర్శకుడితో చర్చలు

కొన్ని రోజుల క్రితం అయితే జెర్సీ దర్శకుడితో మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. మేనమామ అయినటువంటి నిర్మాత అల్లు అరవింద్ వలన ఆ ప్రాజెక్ట్ సెట్టయినట్లు టాక్. దిల్ రాజుతో కలిసి అల్లు ఆరవింద్ ప్రస్తుతం జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో జెర్సీ కథను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

అల్లు అరవింద్ ద్వారా..

అల్లు అరవింద్ ద్వారా..

అయితే అల్లు అరవింద్ గౌతమ్ వద్ద ఇటీవల ఒక అద్భుతమైన స్క్రిప్ట్ విన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కు అయితే ఆ కథ కరెక్ట్ గా సెట్టవుతుందని దర్శకుడికి ముందే ఒక క్లారిటీ ఇచ్చాడట. ఛాన్స్ ఇస్తే తప్పకుండా రామ్ చరణ్ కు కథ చెబుతానని అనడంతో అల్లు అరవింద్ చరణ్ కు కూడా ఫోన్ చేసి మ్యాటర్ చెప్పినట్లు సమాచారం. త్వరలోనే వీరి మధ్య ఒక చర్చ మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

త్రివిక్రమ్ తో మొదటిసారి..

త్రివిక్రమ్ తో మొదటిసారి..

అయితే మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా సినిమా చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇటీవల కథ వినడానికి సిద్ధం కాగా ఇంతలో చరణ్ కు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఇక కరోనా నుంచి ఇటీవల కోలుకోవడంతో మొదటిసారి వీరి మధ్య స్క్రిప్ట్ డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉందట. ఇక ఈ ఏడాది చివరలో ఎన్టీఆర్ సినిమా అయిపోగానే త్రివిక్రమ్ రామ్ చరణ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X