యాంకర్ అవతారం ఎత్తబోతున్న హీరో రామ్ చరణ్!
Recommended Video
టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌ను మనం ఇప్పటి వరకు హీరోగా చూశాం, నిర్మాతగా చూశాం. అయితే త్వరలో ఈ మెగా పవర్ స్టార్ సరికొత్త కొత్త అవతారం ఎత్తబోతున్నారట. తొలిసారిగా ఆయన యాంకరింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం రామ్ చరణ్ ఇటు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసమే చరణ్ యాంకర్ అవతారం ఎత్తబోతున్నారట.

స్వయంగా ఇంటర్వ్యూ చేయబోతున్న చరణ్
సైరా మూవీ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఒక ప్లాన్ ప్రకారం సినిమాపై హైప్ వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేశారట. అందులో భాగమే చరణ్ యాంకరింగ్ అని టాక్. సినిమాలో నటించిన స్టార్ కాస్ట్ ఒక్కొక్కరినీ చరణ్ ఇంటర్వ్యూ చేసిన వీడియోలను రిలీజ్ చేయడం ద్వారా సినిమాపై హైప్ పెంచాలని చూస్తున్నారట.

చిరంజీవి, సురేందర్ రెడ్డితో మొదలు
చిరంజీవి, సురేందర్ రెడ్డి ఇద్దరినీ కలిపి రామ్ చరణ్ తొలి ఇంటర్వ్యూ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘RRR' చిత్రానికి సంబంధించిన షూటింగులో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే షూటింగ్ గ్యాపులో ‘సైరా' చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సైరా నరసింహారెడ్డి
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవి కెరీర్లో 151వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ... ఇప్పటి వరకు ఆయన చేసిన చిత్రాలన్నింటిలోకెల్లా బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

ముఖ్య పాత్రల్లో...
ఈ చిత్రంలో చిరంజీ గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్, భార్యపాత్రలో నయనతార నటిస్తోంది. విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా, సుదీప్, అనుష్క వెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనుష్క శెట్టి రాణిరుద్రమ దేవి పాత్రలో కనిపించబోతోంది. రుద్రమదేవి పాత్ర ద్వారానే ‘సైరా నరసింహారెడ్డి' చిత్రానికి సంబంధించిన కథ ప్రేక్షకలకు చెప్పబడుతుందట.


Click it and Unblock the Notifications











