»   » బ్రూస్ లీ:చిరంజీవి విషయమై రామ్ చరణ్ అన్ హ్యాపీ?

బ్రూస్ లీ:చిరంజీవి విషయమై రామ్ చరణ్ అన్ హ్యాపీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గతంలో పరిస్ధితులు లేవు...ప్రతీ విషయం సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల పుణ్యమా అని చర్చకు దారి తీస్తోంది. తాజాగా బ్రూస్ లీ ఆడియో పంక్షన్ లో చిరంజవి చెప్పిన డైలాగు విషయమై అన్ హ్యాపీగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. చిరంజీవి బ్రూస్ లీ చిత్రంలో మూడు నిముషాల పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వచ్చేసింది.

అయితే చిరు ఎలా కనపడతాడు...ఆయన చెప్పే డైలాగులు ఏంటి...సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయమై చర్చ మొదలైంది. కానీ ఆడియో పంక్షన్ లో వక్తలు చెప్పినదాన్ని బట్టి అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. దాంతో రామ్ చరణ్ హైలెట్ గా ఫీలవుతున్న విషయాలు రివీల్ అవటంతో చిరాకు పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు.


చిరంజీవి ఆ సినిమాలో ఎలా ఉండబోతున్నారో ఇప్పటికే లీకైన ఫొటోలతో గెటప్ విషయమై క్లారిటీ వచ్చేసింది. అలాగే అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రామ్ చరమ్, అల్లు అరవింద్ మద్య వచ్చే హార్స్ రైడింగ్ సీన్ గురించి చెప్పారు. ఇక చిరంజీవి అయితే సినిమా డైలాగు ని చెప్పేసారు.


Ram Charan Unhappy With Chiranjeevi?

మరో ప్రక్క చిరంజీవి మాట్లాడుతూ...బ్రూస్‌లీలో తన పాత్ర గురించి అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారని అన్నారు. బ్రూస్‌లీ సినిమాలో తన ఎంట్రీ కొస మెరుపు లాంటిదని చిరంజీవి అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పాలంటే సంపూర్ణంగా భోజనం చేసిన తర్వాత ఒక స్వీటు తిన్నట్టు ఉంటుందన్నారు. తమకు ఇన్‌స్పిరేషన్ అభిమానులేనని చెప్పారు. సినిమా ఎలాగు రిలీజ్‌కు దగ్గరకు వచ్చింది కాబట్టి సినిమాలోని డైలాగ్ చెప్పడానికి వెనుకాడనని ఒక డైలాగ్ చెప్పారు. బ్రూస్‌లీలో రామ్‌చరణ్ కొట్టిన బాస్ మీ స్టెమినోను, మీ స్పీచ్‌ను అందుకోలేను బాస్ అనే డైలాగ్‌ను చెప్పారు.


రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన 'బ్రూస్‌లీ' సినిమా త్వరలో విడుదల కానుంది.రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాత. ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం సమకూర్చారు.

English summary
According to the on-going fuss on social media, Ram Charan is quite unhappy with the happenings at Bruce Lee audio release and Chiranjeevi also stands as one of the reason. Guests at the audio function almost revealed everything related to Chiranjeevi's cameo in Bruce Lee. While V V Vinayak hinted that Chiranjeevi looked rugged and sharp in the get up, Allu Aravind revealed that Ram Charan and Chiranjeevi will be seen riding the horses. This has killed any surprise in the cameo and resulted in worrying Ram Charan.
Please Wait while comments are loading...