Ram Charan: తండ్రి కాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్? నెట్టింట వైరల్

రామ్ చరణ్.. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయిన తన నటనతో చిరుతగా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇటీవలే RRR సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే రామ్ చరణ్ కు ఉపాసనతో వివాహం జరిగి సుమారు పదేళ్లు కావొస్తుంది. అప్పటి నుంచి ఈ దంపతులకు పిల్లలు లేరనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఎప్పుడూ వస్తున్న టాపిక్..

ఎప్పుడూ వస్తున్న టాపిక్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉపాసతో పెళ్లి జరిగి సుమారు 10 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ ఈ దంపతులకు పిల్లలు లేరనే టాపిక్ ఎప్పుడూ వస్తూనే ఉంది. ఇటీవల సద్గురుతో ఉపాసన మాట్లాడిన మాటలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. అక్కడ పిల్లలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది.

లోటు గట్టిగానే ఉన్నట్లు..

లోటు గట్టిగానే ఉన్నట్లు..

అంతేకాకుండా పిల్లలు లేరనే ప్రశ్నలు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఎప్పుడూ తలెత్తుతూనే ఉన్నాయి. చాలా ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలను ఫేస్ చేసింది ఉపాసన. అయితే ఆ ప్రశ్నలకు తమదైన స్టైల్ లో సమాధానాలు చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా చెర్రీ, ఉపాసనకు పిల్లలు లేరనే లోటు మెగా కాంపౌడ్ లో స్ట్రాంగ్ గానే ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

త్వరలో తల్లి కాబోతున్న ఉపాసన..

త్వరలో తల్లి కాబోతున్న ఉపాసన..

అయితే ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏంటంటే.. రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారట. రామ్ చరణ్ సతీమణి ఉపాసన తల్లి కాబోతున్నారని మెగా సర్కిల్ నుంచి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయని రూమర్ చక్కర్లు కొడుతోంది.

బుల్లి మెగాస్టార్..

బుల్లి మెగాస్టార్..

మరో ఐదు, ఆరు నెలల్లో ఉపాసన ప్రసవించనుందని, త్వరలో బుల్లి మెగాస్టార్ అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు. ఇప్పటివరకు ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా స్పందించలేదు. కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుందనే చెప్పాలి.

 ఆ బ్యూటీతో రెండోసారి..

ఆ బ్యూటీతో రెండోసారి..

ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికొస్తే.. ఇటీవల RRR సినిమాలో అల్లూరి సీతరామరాజుగా ఎంతో ఆకట్టున్నాడు. ఆ పాత్రలో అద్భుతమైన నటన కనబర్చాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియాగా RC15 మూవీ చేయనున్నాడు చెర్రీ. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రెండోసారి చెర్రీతో జత కట్టనుంది.

 విక్రమ్ డైరెక్టర్ తో..

విక్రమ్ డైరెక్టర్ తో..

ఇది కాకుండా గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయనున్నాడట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అలాగే ఇటీవల విక్రమ్ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో రామ్ చరణ్ ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మగధీర, నాయక్, ఎవడు, ధ్రువ, రంగస్థలం వంటి తదితర చిత్రాలతో సక్సెస్ సాధించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X