రామ్ చరణ్, ఉపాసన దంపతుల రెండో వెంచర్
హైదరాబాద్ మోనాబాద్ దగ్గరలో ఆర్.సి పోలో క్లబ్ కొనుగోలు చేసిన రామ్ చరణ్,ఉపాసన దంపతులు తమ రెండో వెంచర్ కి శ్రీకారం చుట్టారు. వారిద్దరూ కలిసి జిమ్ మరియు ఫిట్ నెస్ సెంటర్ ని పెడుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ దగ్గరలోని అపోలో హెల్త్ క్యాంపస్ లో ఈ ఫిటెనెస్ సెంటర్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తైంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్ లో ఈ జిమ్ ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు.
రామ్ చరణ్ హానీమూన్ అనంతరం ఏ మాత్రం రిలాక్స్ కాకుండా తన తర్వాత ప్రాజెక్టులలో బిజీ అయ్యిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎవడు చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో ప్రక్క ఈ సినిమా అనంతరం జంజీర్ రీమేక్ లో పాల్గొంటారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తోంది. ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ సినిమాలోనూ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలూ మాస్ ని టార్గెట్ చేసినవే కావటం విశేషం. ఆరెంజ్ ప్లాప్ కావటంతో రామ్ చరణ్ పూర్తిగా తన తండ్రి నటించిన సూపర్ హిట్స్ తరహా పాత్రలనే ఎంచుకోవటానికే ఆసక్తి చూపుతున్నారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ బాణీలతో జోరుగా ముస్తాబవుతోన్న ఈ సినిమాకి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అల్లు అర్జున్ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. ఇక తమన్నాతో కలిసి రామ్‌చరణ్ చేసిన 'రచ్చ' ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది.
డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా మారారు. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. 'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత 'ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ 'ఎవడు' సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.


Click it and Unblock the Notifications











