RRR ఎఫెక్ట్: రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా బాటలోనే.. విజయ్ దేవరకొండ దర్శకుడితో న్యూ ప్లాన్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR షూటింగ్ ఇంకా పూర్తి కావడానికి ఏడాది సమయమైనా పట్టవచ్చు. అందుకే ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనేది ఫైనల్ చేయలేకపోతున్నాడు చరణ్.

Recommended Video

RRR Update : Rajamouli Taking Hard Decisions For RRR Movie Shooting
 నెక్స్ట్ పాన్ ఇండియా సినిమానే..

నెక్స్ట్ పాన్ ఇండియా సినిమానే..

కమర్షియల్ కథలు కాకుండా కొంచెం కొత్తగా ఉండేలా ఏదైనా ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నాడు. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో సిద్ధమవుతున్నాడు. దీంతో చరణ్ కూడా వీలైనంత వరకు పాన్ ఇండియా కథలతోనే రావాలని అనుకుంటున్నాడు. కానీ సరైన ప్రాజెక్టులు దొరకడం లేదు.

రూమర్స్ కి కౌంటర్

రూమర్స్ కి కౌంటర్

ఇటీవల రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలకు సంబంధించి అనేక రకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని దానికి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని కూడా టాక్ వచ్చింది. కానీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎవరు అబద్దాలని నమ్మవద్దని రామ్ చరణ్ సోషల్ మీడియాలో చిట్టిబాబు ఫోటోతో రూమర్స్ కి కౌంటర్ ఇచ్చాడు.

 ఆ దర్శకుడితో..

ఆ దర్శకుడితో..

ఇక లేటెస్ట్ గా మరో రూమర్ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి లాంటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో చరణ్ వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా క్రైమ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే అవకాశం ఉన్నట్లు టాక్. ఇప్పటికే కొన్ని పాయింట్స్ చెప్పిన సందీప్ మెగా హీరోను మెప్పించినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ తో డీల్ సెట్

రామ్ చరణ్ తో డీల్ సెట్

సందీప్ ఆల్ రెడీ బాలీవుడ్ లో ఒక సినిమాకి కమిటైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కరోనా వల్ల ఆ సినిమా షూటింగ్ జరగడం లేదు. దీంతో రామ్ చరణ్ తో డీల్ సెట్ చేసుకొని మంచి పాన్ ఇండియా కథను అల్లుతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి చరణ్ చేత అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇప్పించాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X