RC 15 రామ్ చరణ్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన కాజల్.. మరీంత ఆలస్యంగా శంకర్ మూవీ?
రామ్ చరణ్ శంకర్ కలయికలో రాబోతున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో రామ్ చరణ్ తేజ్ రెండు భిన్నమైన సీడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ లీక్ కావడంతో అంచనాల స్థాయి అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. అయితే ఆ ప్రాజెక్టుకు మధ్యలో మరోక సమస్య వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాజల్ ఇచ్చిన ఒక వివరణతో షూటింగ్ కు మళ్లీ బ్రేక్ పడే అవకాశం ఉందట. పూర్తి వివరాల్లోకి వెళితే..

దిల్ రాజు బిగ్ బడ్జెట్
దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ తో ఒక పాన్ ఇండియా ప్రాజెక్టును తెరపైకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యధిక భారీ బడ్జెట్ తో ఆ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపుగా 200 కోట్లు కూడా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకమైన యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా నిలువబోతున్నాయట.

రామ్ చరణ్ డిఫరెంట్ రోల్స్
అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకేక్కించడంలో దర్శకుడు శంకర్ ఏ విధంగా ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రాంచరణ్ 15వ సినిమాలో కూడా అన్ని కమర్షియల్ అంశాలు ఉండబోతున్నాయట. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా ఒక ప్రభుత్వ అధికారిగా అతను నటించే విధానం అద్భుతంగా ఉండబోతుందట.

వాయిదాల పర్వం
అయితే ఈ సినిమా విడుదల తేదీ పై మొదటి నుంచి కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. అసలైతే ఇదే ఏడాదిలో సినిమాను దసరా సమయానికి విడుదల చేయాలని ప్రాజెక్టును మొదలుపెట్టారు. కానీ శంకర్ ప్రణాళికలు ఎప్పటిలానే వాయిదాలు పడుతూ వచ్చింది. షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి కూడా సమయం సరిపోకపోవడంతో సమ్మర్లో విడుదల చేయాలి అని దిల్ రాజు మరొక ప్లాన్ రెడీ చేసుకున్నాడు.

కాజల్ చెప్పినట్లు..
అయితే మూడు విడుదల తేదీలు మారినప్పటికీ కూడా శంకర్ ప్లాన్ అయితే వర్కౌట్ కావడం లేదు అని తెలుస్తోంది. ఈసారి కూడా సమ్మర్లో రావడం కాస్త అనుమానంగానే ఉన్నట్లు కొత్త టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల కాజల్ అగర్వాల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలోనే ఇండియన్ 2 సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలవబోతోంది అని దానికోసమే ప్రస్తుతం ఓ ప్లాన్ రెడీ అవుతున్నట్లుగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

మరో రూమర్
కాజల్ చెప్పిన దాన్ని బట్టి ఇండియన్ 2 సినిమా షూటింగ్ సెప్టెంబర్ అక్టోబర్ లో రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉందట. ఎందుకంటే లైకా ప్రొడక్షన్ వారు చట్టపరంగా కోర్టును ఆశ్రయించి సినిమాను రీ స్టార్ట్ చేసే అవకాశం ఉందట. అంటే శంకర్ ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మళ్లీ రామ్ చరణ్ సినిమా పనులను కూడా ముగించాలి అంటే కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి సమ్మర్ లో కాకుండా RC 15వ సినిమా ఆగస్టు లో విడుదల అయ్యే అవకాశం ఉంది అని మరొక కొత్త రూమర్ అయితే వైరల్ గా మారుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే చిత్ర యూనిట్ సభ్యుల అధికారికంగా క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











