RC 15: రాం చరణ్ మూవీకి క్రేజీ టైటిల్.. ప్రకటించేది ఎప్పుడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రామ్ చరణ్ 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తి అయినట్లుగా రామ్ చరణ్ ఇటీవల ఆచార్య ప్రమోషన్లో తెలియజేశాడు. తప్పకుండా ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే ఉంటుంది అని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశాడు.

రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడు అని తెలుస్తోంది. అంతేకాకుండా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు కూడా కొన్ని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇంతవరకు ఆ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ మధ్య కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆ విషయంలో చాలా సీరియస్ గా ఆలోచించారు. మరొకసారి ఫొటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సాధారణంగా దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమాను మొదలు పెట్టినా కూడా చిన్న విషయం కూడా బయటకు వెళ్ళడానికి వీలులేదు అని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు.

Ram charan upcoming project rc 15 latest update on title announcement

ఇక రామ్ చరణ్ సినిమా కోసం కూడా అదే తరహాలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టారు అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆ మధ్య ఒక టైటిల్ ఫైనల్ అయినట్లుగా టాక్ వచ్చింది. అంతే కాకుండా 'సర్కారోడు' అనే టైటిల్ కూడా చర్చల దశలో ఉన్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. రీసెంట్ గా అమృత్సర్ లో ఒక కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రం యూనిట్ సభ్యులు త్వరలోనే ఒక ప్రత్యేకమైన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్.

సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను వచ్చే నెలలో లేదా జూలై మొదటి వారంలో విడుదల చేయవచ్చు అని ఒక టాక్ అయితే వస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక రామ్ చరణ్ శంకర్ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ఇటీవల పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా స్పోర్ట్స్ మూవీ కాదు అని అదొక డిఫరెంట్ మూవీ అంటూ చరణ్ మరొక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక శంకర్ రామ్ చరణ్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X