RC15: రామ్ చరణ్ కోసం పవర్ఫుల్ విలన్.. శంకర్ మళ్ళీ అదే ప్లాన్?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా అనంతరం వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైవ్ లో పెడుతూ ఉన్నాడు. ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ ని అందుకుంటుందో తెలియదుగానీ తదుపరి సినిమాలతో మాత్రం ఎలాగైనా సోలోగా పాన్ ఇండియా మార్కెట్ సెట్ చేసుకోవాలని రామ్ చరణ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న RRR సినిమా మొత్తానికి విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించాడు.

తప్పకుండా RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక స్పెషల్ మార్కెట్ అయితే క్రియేట్ చేస్తోంది అని రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే వారు తదుపరి సినిమాలను భారీ స్థాయిలో ఉండేలా పాన్ ఇండియా ప్రాజెక్టులుగా మలుచుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ తేజ్ మొదటి సారి తమిళ దర్శకుడు శంకర్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ దర్శకుడు కూడా ఎప్పటినుంచో తెలుగు హీరోతో సినిమా చేయాలని చూస్తున్నారు. మొదట మెగాస్టార్ చిరంజీవితో అనుకున్నప్పటికీ సెట్టవ్వలేదు. ఆ తర్వాత మహేష్ బాబుతో కూడా అప్పట్లో చర్చలు జరిపారు కానీ అది కూడా వర్కౌట్బ్ కాలేదు.

Ram charan upcoming project rc 15 main villain role update

ఇక ఫైనల్ గా రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న RC 15 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే రామ్ చరణ్ తేజ్ కు విలన్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే దర్శకుడు శంకర్ మెయిన్ విలన్ గా ఒక మలయాళం నటుడిని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నలుగురు విలన్స్ ఉంటారట. ఇక ప్రధాన విలన్ మాత్రం ఫుల్ గా ఉండాలి అని దర్శకులు చాలామందిని ఆడిషన్ చేశాడట. అయితే ఎవరు కూడా అంతగా నచ్చకపోవడంతో ఫైనల్ గా మలయాళం స్టార్ యాక్టర్ సురేష్ గోపీ ని సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఈ నటుడు శంకర్ తెరకెక్కించిన 'ఐ' సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అమాయకమైన డాక్టర్ గా కనిపిస్తూనే భయంకరమైన విలనిజం చూపించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ నటుడిగా అయితే సురేష్ గోపికి మంచి గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు మళ్లీ అదే నటుడికి రామ్ చరణ్ కు మెయిన్ విలన్ గా సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ విషయంపై అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ త్వరలోనే పూర్తిగా నటీనటుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని శంకర్ ఆలోచిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మార్కెట్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా సినిమాకు 150 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇటీవల మొదలైన ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది అక్టోబర్ లోగా పూర్తి చేసి 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X