RC 15: ప్రభాస్ కంటే ముందుగానే రామ్ చరణ్.. ఆ డేట్స్ ఫిక్స్ అయినట్లే?
రామ్ చరణ్ శంకర్‌ల కలయికలో రూపొందుతున్న RC 15 పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. RRR అనంతరం రామ్ చరణ్ నుంచి వస్తున్న హై బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక శంకర్ కాబట్టి మంచి స్టోరీ ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదు.
2024 సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదివరకే నిర్మాత దిల్ రాజు ఆ విషయంపై ఒక వివరణ ఇచ్చారు. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం 2024 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.RC15 టీమ్ ఇప్పటివరకు సినిమా ప్లాట్ ఇతర వివరాల గురించి పెదవి విప్పలేదు. అయితే అభిమానులలో మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో శంకర్ ట్రాక్ రికార్డ్, రామ్ చరణ్ అద్భుతమైన నటన RC 15 సినీ ప్రేమికులకు ఒక ట్రీట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రం నిజంగా జనవరి 10న విడుదలైతే.. జనవరి 12న న్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే విడుదల కావచ్చట. చరణ్ కు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపడానికి రెండు రోజులు ఉంటాయి. దీంతో అదనపు థియేటర్స్ లభించే అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా RC15కి ప్రయోజనం చేకూరుతుంది.
ఇక 2024 సంక్రాంతికి నాగార్జున ప్రసన్నకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా డిఫరెంట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది. అలాగే మరో చిన్న సినిమా కూడా వచ్చే సంక్రాంతికి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. ఆ లిస్టులో కిరణ్ అబ్బవరం తదుపరి సినిమా కూడా రావచ్చని తెలుస్తోంది. తప్పకుండా రెండు పెద్ద సినిమాలు ఒక మీడియం రేంజ్ సినిమా అలాగే మరొక చిన్న సినిమా 2024 సంక్రాంతికి రావచ్చు అని తెలుస్తోంది. మరి ఆ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











