వంశీ పైడిపల్లి, రామ్ చరణ్ ల చిత్రం టైటిల్ అదే
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా త్వరలో ఓ చిత్రం రూపొందనుందన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం టైటిల్ వాడే అని తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్ కూడా ఓకే చేసినట్లు చెప్తున్నారు. త్వరలోనే ఫిల్మ్ చాంబర్ లో ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించనున్నారు. ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ మా బేనర్‌లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. రామ్‌చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్ చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు.
ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











