ఒకే కథతో రామ్ చరణ్, వెంకటేష్?
రామ్ చరణ్ తేజ తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు అనే చిత్రం చేస్తున్నారు. మరో ప్రక్క వెంకటేష్ ..మెహర్ రమేష్ దర్శకత్వంలో షాడో చిత్రం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ ఒకే కథతో సినిమాలు చేస్తున్నారంటూ రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. వారు చెప్పే దాని ప్రకారం రామ్ చరణ్ ఎవడులో ..వరసగా మర్డర్స్ జరిగిపోతూంటాయి. ఇన్విస్టిగేషన్ జరుగుతూంటుంది. ఎవరు ఆ కిల్లర్ అనేది తెలియదు...చివరకి ఎవడు చేస్తున్నాడు అనేది తేలుతుంది. ఆ ఎవడే రామ్ చరణ్ అని చెప్పి..దానకి కారణం చెప్తారు.
ఇక వెంకటేష్ ..షాడో విషయానికి వస్తే...అందులోనూ వరసలో మర్డర్స్ జరుగుతాయట. శ్రీకాంత్ పోలీస్ అధికారిగా ఇన్విస్టిగేట్ చేస్తూంటాడు. అక్కడా ఓ ట్విస్ట్ తో కథ మలుపు తిరిగి కిల్లర్ ఎవరో తెలుస్తుంది. వెంకటేష్ కి ఆ కిల్లర్ కి సంభందం ఏమిటన్నది కథ. ఇలా ఈ రెండు కథలూ ఒకటే అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి విచిత్రమైన కథలతో పెద్ద సినిమాలు ఎందుకు చేస్తారు..అని సామాన్య ప్రేక్షకుడు సైతం అనుమానపడతాడు. కాబట్టి ఇది రూమర్ మాత్రమే అయ్యుండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











