బన్నీని బోల్తా కొట్టించిన వినాయక్ చరణ్ ని ‘మెరి’పిస్తాడా...!?

By Sindhu

ఆరెంజ్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకడు ధరణితో 'మెరుపు" అనే సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా కమిట్ అయిన ఈ చిత్రం దాదాపు మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఆరెంజ్ ఊహించని రీతిలో ప్లాప్ కావడం, ఈ సినిమాకి భారీ రేంజ్ లో బడ్జెట్ ఎస్టిమేట్ కావడంతో చరణ్ రిస్క్ ఎందుకని ఈ సినిమాని పక్కన పెట్టి సంపత్ నందితో 'రచ్చ" సినిమాకి కమిట్ అయ్యాడు.

దీంతో ఈ సినిమా నుండి దర్శకుడు ధరణి, హీరోయిన్ కాజల్ ఇద్దరూ తప్పుకున్నారు. ఇటీవల ఓ సందర్భంలో రామ్ చరణ్ 'మెరుపు" ఆగిపోలేదని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించడంతో దాదాపు అటకెక్కేసిందనుకున్న ఈ సినిమాపై మళ్ళీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర కథకి మరికొన్ని మాస్ హంగులు అద్ది కమర్షియల్ దర్శకుడు వివి వినాయక్ దర్శక్వంలో వహించబోతున్నాడని తెలుస్తుంది. వచ్చే నెలలోనే సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్ తన డేట్స్ ను ఎడ్జస్ట్ చేసుకుంటున్నాడట. మరి అల్లు అర్జున్ ని బోల్తా కొట్టించిన వినాయక్ కనీసం చరణ్ నైనా మెరిపిస్తాడేమో చూడాలి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X