చరణ్, వినాయిక్ కాంబినేషన్ కాన్సిల్ కారణం ఎన్టీఆర్?
రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందని, అందులో హీరోయిన్ గా సమంతను బుక్ చేసారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం ఆగిపోయినట్లేనని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దానికి కారణం ఎన్టీఆర్ వెంటనే తనతో సినిమా చేయమని వివి వినాయిక్ కి పురమాయించటమని చెప్తున్నారు. ఎన్టీఆర్ కోరక మేరకు దానవీర శూరకర్ణ చిత్రం రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు వినకిడి. నిజానకి రచ్చ తర్వాత చరణ్ తో వినాయిక్ చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది. అలా చేస్తే బద్రీనాధ్ విడుదల అనంతరం వినాయిక్ తనకి చాలా గ్యాప్ వస్తుందని ఫీలయ్యి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక బద్రీనాధ్ చిత్రం ఈ వారమే విడుదల కానుంది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











