బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలనేది చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజా కోరిక అని చెబుతున్నారు. రామ్ చరణ్ తేజా నటిస్తున్న ప్రస్తుత చిత్రం 70 శాతం పూర్తయింది. ఈ షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సినిమాతో బిజీ కాబోతున్నాడు. బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ఆయన నటించబోతున్నాడు. రామ్ చరణ్ తేజా బాబాయ్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ ఒక ప్రధాన పాత్రను పోషించే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. దీనికి హారీస్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తారు.