అక్కడ టాక్ సినిమాని దెబ్బకొడుతోందని గమనించిన రామ్ చరణ్, జాగ్రత్తలు

ఓవర్ సీస్ లో ముందుగా షోలు పడి అక్కడ టాక్ ముందే వచ్చేస్తోంది. అందుకేనేమో రామ్ చరణ్ దృష్టి ఈసారి ఓవర్ సీస్ పై పెట్టారు.

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్ కు తొలి నుంచి ఓవర్ సీస్ బిజినెస్ వైజ్ పెద్ద ప్రోత్సాహకరంగా ఉండటం లేదు. ఓవర్సీస్ లో మాత్రం ఒక 'మగధీర' మినహా చరణ్ సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అక్కడ పెద్దగా కలెక్షన్స్ ఉండటం లేదు. ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా అక్కడ అంతంత మాత్రంగానే అడుతున్నాయి. చిన్న, మీడియం తరహా హీరోలు కూడా మిలియన్ మార్క్ ను ఈజీగా క్రాస్ చేసేస్తుంటే చరణ్ ఇప్పటికీ ఆ రికార్డును అందుకోకపోవటం ఆశ్చర్యం అనిపిస్తుంది.

దానికి తోడు ఓవర్ సీస్ లో ముందుగా షోలు పడి అక్కడ టాక్ ముందే వచ్చేసి, ఇక్కడ కూడా స్ప్రెడ్ అవుతోంది. దాంతో అక్కడ టాక్ ని బట్టే ఇక్కడ ఓపినింగ్స్ వస్తున్నాయి. ఇవన్నీ చరణ్ గమనించినట్లున్నారు. అందుకేనేమో ఆయన దృష్టి ఈసారి ఓవర్ సీస్ పై పెట్టారు.

రామ్ చరణ్ తేజ్ తన తాజా చిత్రం 'ధృవ' విషయంలో ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన మేకోవర్ దగ్గర్నుంచి ప్రమోషన్ల వరకూ అన్నింటి మీదా దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఓవర్సీస్ పబ్లిసిటీ విషయంలో మరీ ఎక్కువ శ్రద్ద చూపుతున్నట్లు సమాచారం.

Ram Charan wants to Concentrate on Overseas

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం 'ధ్రువ'. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేస్తే మంచి స్పందన వచ్చింది.

నిర్మాత అరవింద్ మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని 2వ తేదీనే విడుదల చేయాలనుకున్నా పెద్దనోట్ల రద్దువల్ల వాయిదా వేశామని, 9న అయితే బాగుంటుందని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని తెలిపారు. ట్రైలర్‌ను ప్రీ రిలీజ్‌కు వేడుకలో విడుదల చేయాలనుకున్నామని, చూసినవారందరూ ట్రైలర్స్ బాగున్నాయని అనడంతో ఈ ట్రైలర్‌ను ప్రేక్షకులకు చూపించాలని ముందుగానే విడుదల చేస్తున్నామని తెలిపారు.

వైజాగ్, తిరుపతి, విజయవాడ లాంటి అన్ని పట్టణాల్లో ఈ ప్రమోషన్స్ జరుగుతున్నాయని, న్యూజెర్సీ, శాన్‌ఫ్రాన్సిస్కోతో సహా యుఎస్‌లో అనేక చోట్ల ప్రిమియర్ షో ప్రదర్శించనున్నామని ఆయన తెలిపారు. మూవీ ప్రీ రిలీజ్ వేడుక కూడా డిసెంబర్ 4న నిర్వహించనున్నామని ఆ వివరాలను త్వరలో తెలుపుతామని ఆయన అన్నారు.

చరణ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడని మరో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తెలిపారు. తన కెరీర్‌లో 'ధ్రువ' స్పెషల్‌గా నిలుస్తుందని, తనకు ఇష్టమైన తనిఒరువన్ చిత్రాన్ని ఎవరు తెలుగులో రీమేక్ చేస్తారా అని ఎదురుచూసిన తనకు అందులోనే హీరోయిన్‌గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని నటి రకుల్ తెలిపారు.

డిసెంబర్ 9న విడుదలకానున్న ఈ చిత్రంలో అరవింద్‌స్వామి, నాజర్, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా:పి.ఎస్.వినోద్, సంగీతం:హిప్ హాప్ తమిళ, ఎడిటింగ్:నవీన్ నూలి, దర్శకత్వం:సురేందర్‌రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X