Game Changer: రామ్ చరణ్ ఒక్కడు కాదు ఏడుగురు.. టాలీవుడ్‌లో తొలిసారి.. లీకైన శంకర్ మాస్టర్ ప్లాన్
టాలీవుడ్‌లోని టాప్ హీరో కుమారుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన రీతిలో ప్రేక్షకులను అలరించే సినిమాలు చేస్తూ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీనికితోడు RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో చరణ్ మరో ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు గ్లోబర్ స్టార్ అనే బిరుదునూ అందుకున్నాడు.
పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయిన తర్వాత రామ్ చరణ్ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు సౌతిండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో కలిసి 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలుండగా.. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని బ్రేకులు వచ్చాయి. దీంతో ఇప్పటికి దీనికి సంబంధించిన 50 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇక, మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అందుకు అనుగుణంగానే పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది.
క్రేజీ కాంబోలో రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. అందులో ఒకటి ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర కాగా.. రెండోది కొడుకు రోల్ అని తెలిసిపోయింది. ఈ చిత్రం రాజకీయ నేపథ్యంతో సాగే ప్రతీకార కథతో రూపొందుతోన్నట్లు కూడా వార్తలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ న్యూస్ కూడా వైరల్ అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్ ఏడు గెటప్‌లలో కనిపిస్తాడని తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. అందులో ఒకటి తండ్రి పాత్రకు సంబంధించిన గెటప్ కాగా.. మిగిలినవి అన్నీ యంగ్ రామ్ చరణ్ కనిపించేవే అని తెలిసింది. ప్రత్యర్థులను బోల్తా కొట్టించడం కోసమే అతడు వేరే వేరు గెటప్‌లలో కనిపిస్తాడని టాక్.
ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











