Game Changer: రామ్ చరణ్ ఒకటి కాదు మూడు.. గేమ్ చేంజర్ అసలైన సర్‌ప్రైజ్ లీక్

సౌతిండియా నుంచి పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన హీరోలు ఇప్పుడు చాలా మందే ఉన్నారు. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వెళ్లిన వాళ్లే ఎక్కువగా హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న అతడు.. గ్లోబల్ స్టార్‌గా మారి రచ్చ లేపుతున్నాడు. దీంతో వరుసగా మూవీలు చేస్తున్నాడు.

గ్లోబల్ రేంజ్‌కు ఎదిగిపోయిన తర్వాత మెగా హీరో రామ్ చరణ్ ఫుల్ జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు సౌతిండియన్ లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్‌తో కలిసి 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలుండగా.. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు.

Ram Charan will Seen Three Getups in Game Changer Movie

పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని బ్రేకులు వచ్చాయి. దీంతో ఇది చాలా ఆలస్యం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ సినిమా షూట్‌ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం కొంత ప్యాచ్ వర్క్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇలా దీన్ని డిసెంబర్‌ నాటికి రెడీ చేయనున్నారు.

మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీతో రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. అందులో ఒకటి ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర కాగా.. రెండోది కొడుకు రోల్ అని తెలిసిపోయింది. ఈ చిత్రం రాజకీయ నేపథ్యంతో సాగే ప్రతీకార కథతో రూపొందుతోన్నట్లు కూడా తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా మరో న్యూస్ లీకైంది.

Ram Charan will Seen Three Getups in Game Changer Movie

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్ మూడు గెటప్‌లలో కనిపిస్తాడని తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. అందులో ఒకటి తండ్రి పాత్రకు సంబంధించిన గెటప్ కాగా.. మిగిలినవి అన్నీ యంగ్ రామ్ చరణ్ కనిపించేవే అని తెలిసింది. మొదట్లో కాలేజ్ స్టూడెంట్‌గా కాస్త రఫ్‌ లుక్‌లో కనిపించే అతడు.. ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత క్లీన్ షేవ్‌తో ఉంటాడట. ఈ మూడు గెటప్‌లు ఫ్యాన్స్‌ ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం.

ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జంటగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: ram charan game changer s shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X