twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ 'ఎవడు' ఆ హాలీవుడ్ నుంచే?

    By Srikanya
    |

    రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడు త్వరలో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ ప్రస్తుతం జరగుతోంది. ఇక ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం ఫేస్ హాఫ్ నుంచి ప్రేరణ పొంది కథ తయారు చేస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇది కేవలం కొందరి ఊహాగానమేనా లేక నిజమా అనేది తెలియాల్సి ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వారు చెప్పేదాని ప్రకారం .. అల్లు అర్జున్ పాత్ర ఎంతో సేపు ఉండదు. కథలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రయాణిస్తున్న బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది. అల్లు అర్జున్ ముఖం మొత్తం కాలిపోతుంది. అదే బస్సులో ప్రయాణిస్తున్న రామ్ చరణ్ చనిపోతాడు. అప్పుడు అల్లు అర్జున్ తనని చంపటానికి ఆ బస్సుని పేల్చిన వాళ్లని కనుక్కోవటానికి ఓ ప్లాన్ చేస్తాడు.

    రామ్ చరణ్ ఫేస్ ని తీసుకుని తను పెట్టుకుని రామ్ చరణ్ లా బయిటకు వస్తాడు. రామ్ చరణ్ ఓ పోలీస్ అధికారి కావటంతో అక్కడనుంచి తనే ఇన్వెస్ట్ గేట్ చేసి చివరకు విలన్స్ ను ఎలా తుదముట్టించారన్నదిసగా కథ నడుస్తుందని చెప్పుకుంటున్నారు. ఇక గతంలో ఫేస్ హాఫ్ ఆధారంగా కృష్ణ..మానవడు-దానవడు చిత్రం చేసారు. అయితే కొంతమంది మాత్రం కథ ఇది కావాలని బయిట కొందరు వండి ప్రచారం చేస్తున్నదే అని చెప్పటం జరుగుతోంది. రామ్ చరణ్ లాంటి హీరోకి దిల్ రాజు ఇలాంటి కథ ఎందుకు తీసుకుంటారని,ఫేస్ హాఫ్ ఈ కాలానికి అస్సలు వర్కవుట్ కాదనే వాళ్ళూ ఉన్నారు. ఏది నిజం, ఏది అబద్దం అనేది తేలాలంటి కొద్ది రోజులు ఆగాల్సిందే.

    English summary
    The script of Ram Charan's Yevadu film is inspiration of Hollywood film Face Off.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X