చెర్రీ ‘ఎవడు’కు...షారుక్ డాన్ 2కు లింకు!
రామ్ చరణ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'ఎవడు' అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే ఎవడు సినిమాపై ఫిల్మ్ నగర్‌లో ఓ పుకారు వినిపిస్తోంది. అదేమిటంటే..... ఇటీవల విడుదలైన బాలీవుడ్ స్టార్ షారుఖ్ 'డాన్2' సినిమాకు, ఎవడు చిత్రానికి ఓ పోలిక ఉందని అంటున్నారు. డాన్2 చిత్రంలో షారుఖ్ వేరొకరి మాస్క్ వేసుకుని కనిపిస్తాడు. ఎవడు చిత్రంలో కూడా చరణ్ రామ్ అల్లు అర్జున్ మాస్క్ వేసుకుని కనిపిస్తాడట. ఈ రకంగా అల్లు అర్జున్ పగ తీరేలా చేస్తాడట.
కథ పరంగా, స్ర్కిప్టు పరంగా ఈ రెండు సినిమాలకు సంబంధం లేకుంన్నా...మాస్కు ధరించే విషయంలో పోలిక ఉండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే గతంలో చాలా సినిమాల్లో ఇలాంటి మాస్కుల సన్నివేశాలు వచ్చాయి. అంత మాత్రాన ఇలా డాన్2 చిత్రానికి, రామ్ చరణ్ చిత్రానికి లింకులు పెట్టడం సరికాదంటున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











