‘జంజీర్’ రీమేక్‌తో చరణ్ బాలీవుడ్ ఎంట్రీ?

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ బాలీవుడ్‌ కన్నేశాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఏడాదిలో ఈ వార్త నిజం కాబోతోంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్-జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' చిత్రానికి రీమేక్‌గా రూపొందనున్న చిత్రం ద్వారా రామ్‌ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 1974లో మే 11న విడుదలై జంజీర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.

తాజా ఈ చిత్రాన్ని ప్రకాష్ మెహ్రా తనయుడు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరిగాయని, ఇందులో నటించడానికి రామ్‌చరణ్ తన అంగీకారం తెలిపాడని తెలుస్తోంది. ఈ చిత్రం 2012 ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్ర వర్గాల సమాచారం.

ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ'సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని ఎన్.వి. ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X