రామ్ చరణ్ 'జంజీర్' రీమేక్ తెలుగు టైటిల్

By Srikanya

హైదరాబాద్: రామ్ చరణ్ తాజాగా హిందీలో 'జంజీర్' రీమేక్ తో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని సైతం ఇక్కడ ఆంద్రాలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి గానూ మెరుపు అనే టైటిల్ ని పెట్టనున్నారని సమాచారం. మెరుపు టైటిల్ తో గతంలో రామ్ చరణ్ హీరోగా సినిమా మొదలై ఆగిపోయింది. తమిళ దర్శకుడు ధరిణి ఈ చిత్రం స్క్రిప్టు సరిగా లేకపోవటంతో ఆపేయాల్సివచ్చింది. ఆ స్లాట్ లోనే రచ్చ చిత్రం వచ్చి రిలీజై హిట్టైంది. అయితే ఆగిపోయిన సినిమా టైటిల్ సెంటిమెంట్ గా పెట్టవచ్చా లేదా అనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఇక ఈ 'జంజీర్' చిత్రాన్ని హిందీ వెర్షన్ కి అపూర్వ లఖియా డైరక్ట్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి మాత్రం దర్శకుడు యోగి పర్యవేక్షణలో చేస్తున్నారు. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి సూచనల మేరుకు ఈ మార్పు జరిగినట్లు సమచారం. వెంకటేష్ తో చింతకాయల రవి చిత్రం చేసిన యోగి ప్రస్తుతం బ్యాంకాక్ ో ఈ పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కి నేటివిటీ కోసం ఈ దర్శకుడుని తీసుకున్నట్లు వినికిడి. ఇక ఈ చిత్రం విషయమై ప్రతీ దాన్ని చిరంజీవి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రచ్చ విషయంలోనూ చిరంజీవి ఇలాగే దగ్గరుండి సినిమా చేయించుకున్నారు.

అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.

అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ మెహ్రా నిర్మాత. ఈ రీమేక్‌లో అమితాబ్‌ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్‌ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్‌ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్‌ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు.

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X