ఎన్టీఆర్ సినిమాకు రామ్ చరణ్ టైటిల్.. నీల్ ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా..!
NTR-Prashanth Neel: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్- సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకుంటుంది. అయితే..ఈ సినిమా డ్రాగన్(Dragon) అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పుడు జోర్డాన్ ఎడారిలో భారీ షెడ్యూల్ కొనసాగుతోంది. అక్కడ ఎన్టీఆర్‌పై హాలీవుడ్ స్టైల్ ఫైట్ సీక్వెన్స్‌లను ప్రశాంత్ నీల్ షూట్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇలా భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా టైటిల్ పై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇంతకీ ఆ వార్త ఏంటీ?
ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ మూవీలో టోవినో థామస్ (Tovino Thomas) విలన్‌గా కనిపించనున్నాడన్న టాక్ ఇప్పటికే హాట్ టాపిక్. ఎన్టీఆర్ - టోవినో మధ్య వచ్చే బ్లడీ ఫైట్ సీక్వెన్స్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. మ్యూజిక్‌ను రవి రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ మూవీలో ఎన్టీఆర్‌ను ఇప్పటివరకు చూడని న్యూ లుక్‌లో చూపించబోతున్నారని సమాచారం. ఇటీవల ఆయన స్టైలిష్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 15 కేజీలు బరువు తగ్గారన్న వార్త అభిమానుల్లో మరింత ఎగ్జైట్‌మెంట్ పెంచింది. 'ఈసారి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ మరో లెవెల్‌లో ఉంటుంది' అని సినీ వర్గాలు అంటున్నాయి.
'డ్రాగన్' కాదు... 'బ్రూస్ లీ'నా?
ఇప్పటివరకు ఈ సినిమాకు డ్రాగన్ (Dragon) అనే వర్కింగ్ టైటిల్ వినిపించింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ మూవీకి 'బ్రూస్ లీ' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఇదే నిజమైతే, దాదాపు దశాబ్దం తర్వాత అదే టైటిల్‌తో మరో సినిమా రానున్నట్లే. గతంలో రామ్ చరణ్ హీరోగా బ్రూస్ లీ (Bruce Lee: The Fighter) వచ్చింది. టైటిల్ రూల్స్ ప్రకారం పదేళ్ల తర్వాత అదే పేరును మళ్లీ వాడుకోవచ్చు.
అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు ఈ టైటిల్‌ను కన్సిడర్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 'RRR తర్వాత చరణ్ టైటిల్‌ను ఎన్టీఆర్ వాడితే వైరాలిటీ గ్యారెంటీ' అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. అయితే నిర్మాతలు మాత్రం ఇంకా ఏ టైటిల్‌ను కన్ఫర్మ్ చేయలేదు. త్వరలోనే గ్రాండ్ ఈవెంట్‌లో అఫీషియల్ టైటిల్ ప్రకటిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ సూచించినట్టు తెలుస్తోంది.
కేజీఎఫ్, సలార్ తో మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్న ప్రశాంత్ నీల్... ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి పవర్‌ఫుల్ పర్ఫార్మర్‌తో ఏ రేంజ్ యాక్షన్ డిజైన్ చేస్తారన్నదే అందరిలో ఆసక్తి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను రోజురోజుకీ పెంచుతున్నాయి. అధికారిక టైటిల్ ఏమవుతుంది? ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇవన్నీ తెలియాలంటే ఇంకొద్దిరోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











