మనసులేని 'మగధీర'...

ఇంతకీ విశయమేమిటంటే మే 28న చరణ్ తన హోండా సివిక్ కారులో రయ్ మని దూసుకెళ్తూ అటుగా వెళ్తున్న ఓ వృద్ధ దంపతులను ఢీ కొట్టాడంట. దీంతో చేసిన తప్పుకు లెంపలేసుకుని వారిని తీసుకెళ్లి జూబ్లీహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాడట. ఇంతవరకూ బాగానే వుంది కానీ ఆ తర్వాత వారిని ఆ ఆసుపత్రి నుండీ తీసుకెళ్లి ఓ చిన్న ఆసుపత్రిలో చేర్పించాడట. అలాగే వైద్యం నిమిత్తం అయిన 90 వేల రూపాయలకు బదులు 45వేలు మాత్రమే ఇచ్చాడట. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుంటుంబం అప్పులపాలయిందట. ఆరోగ్యం బాగుండి వుంటే రోజూ కూలీ చేసి 250 నుండీ 300 రూపాయలు సంపాదించుకొనే వాళ్లమని, ఇప్పుడున్న అనారోగ్య కారణాల వల్ల అది కూడా లేకుండా పోయిందని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆ దంపతుల కుమారుడు స్పందిస్తూ "తాను చిరంజీవి వీరాభిమానినని, ఈ ఉదంతంతో చిరంజీవి అంటేనే ఒళ్లు మండుతోందని, పేదల కోసం పార్టీ పెట్టానని చెప్పి అని ఇలా పేదల కడుపు కొడితే పుట్టగతులుండవని" ఘాటుగా స్పందించాడు. సినిమాల్లో నటించి బాగా అలవాటయిన ఈ పెద్ద మనుషులకు నిజజీవితంలో మంచి గా నటించడం పెద్ద కష్టం కాదు కదా...!! అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











