రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ జీతం తెలిస్తే షాక్.. రోజుకు ఎన్ని లక్షలంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక మూవీ 'పెద్ది' ప్రమోషన్స్‌తో దేశవ్యాప్తంగా బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా కోసం ముంబై, బెంగళూరు, భోపాల్, చెన్నై తదితర నగరాల్లో వరుస ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో రామ్ చరణ్ లుక్, సినిమా కంటే ఎక్కువగా మరో వ్యక్తి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. అతడే చరణ్ కొత్త బాడీగార్డ్ కెవిన్ కుంటా.

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా రామ్ చరణ్ వెనకాల ఆరడుగులకుపైగా ఎత్తుతో, కండలు తిరిగిన భారీ శరీరాకృతితో ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. అభిమానుల మధ్య చరణ్‌కు రక్షణ కవచంలా నిలుస్తూ కనిపిస్తున్న అతని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో "ఎవరీ కెవిన్ కుంటా?" అనే ప్రశ్న నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే కెవిన్ కుంటా సాధారణ బాడీగార్డ్ కాదనే విషయం తెలుసుకున్న తర్వాత అభిమానులు మరింత ఆశ్చర్యపోతున్నారు.

Ram Charan s New Bodyguard Kevin Kunta Daily Salary MMA Background amp amp Viral Buzz

ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో నివసిస్తున్నాడు. ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. 2021లో ఇటలీ జాతీయ MMA జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కెవిన్, మిడిల్‌వెయిట్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచినట్లు సమాచారం. ఫైట్ స్పోర్ట్స్‌లోనే కాకుండా వీఐపీ(VIP)సెక్యూరిటీ రంగంలో కూడా అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులకు క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అందించిన అనుభవం కెవిన్ ఉంది. భారీ జనసందోహాల్లో కూడా ప్రశాంతంగా పరిస్థితులను నియంత్రించే నైపుణ్యం అతనికి ఉంది. ఇటీవల ముంబైలో జరిగిన 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా చరణ్‌ను చుట్టుముట్టినప్పుడు కెవిన్ వ్యవహరించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. అతని అప్రమత్తత, ప్రొఫెషనలిజం చూసి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

అయితే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతున్న అంశం అతని రెమ్యునరేషన్ గురించే. పలు మీడియా కథనాల ప్రకారం రామ్ చరణ్ ప్రమోషనల్ టూర్ సమయంలో కెవిన్‌కు రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పారితోషికం చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన చూస్తే కేవలం ఒక వారం ప్రమోషనల్ టూర్‌కే లక్షల్లో కాకుండా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ పారితోషికానికి సంబంధించి రామ్ చరణ్ బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం "ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే బాడీగార్డుల్లో కెవిన్ ఒకడిగా మారిపోయాడు" అనే చర్చ నడుస్తోంది. చాలామంది బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరాతో కెవిన్‌ను పోలుస్తున్నారు. మరికొందరు అతని లుక్, పర్సనాలిటీ చూసి హాలీవుడ్ యాక్షన్ మూవీస్‌లో కనిపించే సెక్యూరిటీ ఆఫీసర్లను గుర్తు చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

కేవలం ఫిజిక్ మాత్రమే కాదు, కెవిన్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు దారి తీసింది. ఎప్పుడూ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సూట్స్, ఫార్మల్ వేర్‌లో కనిపించే అతను స్టైలిష్ బాడీగార్డ్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం అతని ఫొటోలు అభిమానుల ఫ్యాన్ పేజీల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక మరోవైపు 'పెద్ది' సినిమా కూడా రికార్డు స్థాయి బజ్‌ను సొంతం చేసుకుంటోంది. రామ్ చరణ్ పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కెవిన్ కుంటా పేరు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read more about: ram charan tollywood peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X