రామ్ చరణ్ కోసం నాని త్యాగం..? ‘పెద్ది'కి లైన్ క్లియర్ అయినట్లేనా!

The Paradise -Peddi: సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్‌కు బాక్సాఫీస్ పండుగనే చెప్పాలి. ప్రతీ ఏడాది ఈ సీజన్‌లో స్టార్ హీరోల సినిమాలు పోటీపడి విడుదల కావడం సాధారణ విషయమే. అలాగే, సమ్మర్‌లో కూడా బాక్సాఫీస్ బరిలో భారీ క్లాష్స్ జరుగుతాయి. ఈ సారి కూడా మార్చి నెలాఖరు బాక్సాఫీస్ బరిలో భారీ క్లాష్ జరగబోతుందనే చర్చలకు తాజాగా పెద్ద ట్విస్ట్ పడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది (Peddi)కి, నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న ది పారాడైస్ (The Paradise)కి పోటీ ఉండబోతుందని టాక్ వినిపించింది. కానీ, తాజా పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే?

ఈ సమ్మర్ పోటీలో ఓ వైపు 'దసరా' తర్వాత మరోసారి రా అండ్ రస్టిక్ అవతార్‌లో నాని 'ది ప్యారడైజ్' రంగంలోకి దిగుతుంటే.. మరోవైపు ' గేమ్ చేంజర్' ఫ్లాప్ తర్వాత సోలో కంబ్యాక్ కోసం 'పెద్ది' మూవీతో రాబోతున్నారు. నాని 'ది ప్యారడైజ్' మార్చి 26 లేదా 27 తేదీల్లో విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావించారు. దాదాపు అదే సమయానికి రామ్ చరణ్ 'పెద్ది' మూవీ కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఇలా స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదల అవుతాయనే తెలియడంతో డైరెక్ట్ క్లాష్ ఖాయమనే ప్రచారం సాగింది. ఈ క్లాష్‌పై భారీ హైప్ ఏర్పడింది. ఇద్దరూ వెనక్కి తగ్గేలా కనిపించకపోవడంతో టాలీవుడ్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Ram Charan s Peddi Gets Solo Release as Nani s The Paradise Likely Postponed

అయితే తాజా సమాచారం ప్రకారం 'ది ప్యారడైజ్' షూటింగ్ ఇంకా సగం మాత్రమే పూర్తైందని తెలుస్తోంది. మొత్తం షెడ్యూల్ చూస్తే దాదాపు మరో 50-60 రోజులు షూటింగ్ చేయాల్సి ఉందట. అంతేకాదు, పోస్ట్ ప్రొడక్షన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వీఎఫ్ఎక్స్, పాన్ ఇండియా లెవల్ ప్రమోషన్లు కలిపి చూస్తే మార్చి రిలీజ్ సాధ్యం కాదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అందుకే మేకర్స్ మే లేదా జూన్ 2026కి సినిమా షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఈ నెలలోనే కొత్త రిలీజ్ డేట్‌పై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

'ది ప్యారడైజ్' సినిమాను 'దసరా' ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా (Srikanth Odela) తెరకెక్కిస్తున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో, మార్జినలైజ్డ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి వ్యవస్థపై చేసే పోరాటమే ఈ కథాంశమని తెలుస్తోంది. నాని ఇందులో 'జడల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా వాయిదా పడితే, అది నాని కెరీర్ ప్లానింగ్‌లో ఒక వ్యూహాత్మక నిర్ణయంగానే ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి.

ఇక మరోవైపు 'పెద్ది' విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ డ్రామా కోసం రామ్ చరణ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ షాట్, పాటలు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చేశాయి. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ (A.R.Rahman) సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

'పెద్ది' సినిమా మార్చి 27 న అదే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వర్డల్ వైడ్ గా గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు చిత్ర బృందం అధికారికంగా స్పష్టం చేసింది. ఇటీవల పెద్ది వాయిదా అనే రూమార్స్ వచ్చినా.. షూటింగ్ షెడ్యూల్ ప్రకారం సినిమా ప్లాన్ చేసిన టైమ్‌కే రిలీజ్ అవుతుందని మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఈ పరిణామాలన్నింటిని చూస్తే.. నాని 'ది ప్యారడైజ్' వాయిదాతో రామ్ చరణ్ 'పెద్ది'కి లైన్ క్లియర్ అయినట్టే.. బాక్సాఫీస్ క్లాష్ తప్పడంతో 'పెద్ది'కి భారీ అడ్వాంటేజ్ కూడా.. రామ్ చరణ్ కంబ్యాక్ మూవీ కావడంతో అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఇలా మొత్తంగా చూస్తే.. 'రామ్ చరణ్ కోసం నాని త్యాగం' అనేలా మారిందా? లేక 'ది ప్యారడైజ్' మేకర్స్ తీసుకున్న ప్రాక్టికల్ డిసిషనా? అన్నది అధికారిక ప్రకటన వచ్చాక కానీ తేలదు. కానీ ఒకటి మాత్రం నిజం.. టాలీవుడ్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం 'పెద్ది' మీదే ఉండబోతోంది.

More from Filmibeat

Read more about: nani ram charan peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X