Peddi: రికార్డు ధరకు పెద్ది డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న మూవీ పెద్ది (Peddi). ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ స్కేల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ, చరణ్ కెరీర్‌లో స్టైలిష్ అండ్ రా మాస్ ప్యాకేజీగా నిలవనున్నది. ఈ నేపథ్యంలో పెద్ది మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ రామ్ చరణ్ మూవీ డిజిటల్ రైట్స్ కు ఎన్ని కోట్లంటే?

బుచ్చిబాబు సానా 'ఉప్పెన'తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. అదే డైరెక్టర్‌.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాన్ ఇండియా కాంబినేషన్‌లో రావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కి భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ మీద అంచనాలను అమాంతం పెంచేసింది. "ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల.. పుడతాం ఏటి మళ్లీ" అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ భారీగా వైరల్ అయ్యింది.

Ram Charan s Peddi Locks Record OTT Deal

తరువాత విడుదలైన 'చికిరి' సాంగ్ క్రేజ్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లింది. అతి తక్కువ సమయంలో 100 మిలియన్+ వ్యూస్ సాధించిన పాటగా రికార్డు సృష్టించింది. సోషల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. దీన్ని బట్టి రామ్ చరణ్ మూవీ పెద్దిపై ఎలాంటి క్రేజ్ ఉందో.. అర్థం చేసుకోవచ్చు. పెద్ది మూవీపై భారీ అంచనాలు నెలకొన్న వేళ.. పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం పోటీలో దిగాయి. ట్రేడ్ టాక్ ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 130 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట.

ఇండస్ట్రీలో షూటింగ్ పూర్తయ్యాక కూడా చాలా సినిమాలకు విడుదల తేదీతో పాటు ఓటీటీ డీల్ జరగని సందర్భాలు ఉన్నాయి. కానీ పెద్ది షూటింగ్ ఇంకా పూర్తికాకముందే ఇంత భారీ డీల్ క్లోజ్ కావడం ఒక రికార్డ్‌గా నిలిచిందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ ఒక్క డీల్ సినిమా మార్కెట్ ఎంత భారీగా ఉందో, రామ్ చరణ్ కెరీర్‌లోని పాన్ ఇండియా స్టార్డమ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. మెగా ఫ్యాన్స్ మధ్య "ఇది కదా మా చెర్రీ రేంజ్" అంటూ కామెంట్లు ట్రెండ్ అవుతున్నాయి.

ఈ భారీ యాక్టన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోన్నట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ సెట్‌లో కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారట. ఈ ఫైట్‌లో రామ్ చరణ్ తో పాటు కన్నడ హీరో శివరాజ్‌కుమార్ కూడా పాల్గొంటున్నారట. ఈ యాక్షన్ బ్లాక్‌ను బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తండ్రి, 'దంగల్' ఫేమ్ షామ్ కౌశల్ పర్యవేక్షిస్తుండగా, నవకాంత్ స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తున్నారట.

యూనిట్ సమాచారం ప్రకారం.. ప్రతి ఫైట్ సీన్‌కి ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉంది. ప్రస్తుతం షూట్ అవుతున్న యాక్షన్ ఎపిసోడ్ సినిమా హైలైట్ అవుతుందట. పెద్ది సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2026 సమ్మర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: ram charan buchi babu sana peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X