రామ్ చరణ్ ‘పెద్ది'లో భారీ మార్పులు.. థియేటర్లలో కొత్త వెర్షన్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'పెద్ది'. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి రామ్ చరణ్ కెరీర్‌లోనే అతిపెద్ద సోలో హిట్‌గా నిలిచింది. ఇలా వసూళ్ల పరంగా దూసుకుపోతున్న ఈ సినిమాపై కంటెంట్ విషయంలో మాత్రం కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ నిడివి, కొన్ని పాత్రల ముగింపు, కథనం వంటి అంశాలపై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది. దీంతో మూవీ మేకర్స్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

వాస్తవానికి సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీశాయి. హీరోయిన్‌ను చూపించిన తీరు, కొన్ని షాట్స్ షూటింగ్ పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా బహిరంగంగా స్పందించి క్షమాపణలు చెప్పారు. అనంతరం ఆ సన్నివేశాలను తొలగించారు. కొత్త వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శించారు. అయితే ఇప్పుడు మేకర్స్ దృష్టి పూర్తిగా సెకండాఫ్‌పై పడినట్లు తెలుస్తోంది.

Ram Charan s Peddi Set for New Version as Makers Plan Major Second Half Changes

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించిన మూవీ మేకర్స్ కథనాన్ని మరింత కాంపాక్ట్‌గా, గ్రిప్పింగ్‌గా మార్చేందుకు సిద్ధమవుతున్నారట. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కథనం వేగాన్ని తగ్గిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవడంతో వాటిని ట్రిమ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ పోషించిన 'గౌరినాయుడు' పాత్రకు సంబంధించిన కొన్ని ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను తగ్గించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే కేవలం సీన్లు తొలగించడమే కాకుండా, కథకు మరింత భావోద్వేగ సీన్స్ కూడా చేకూర్చే ప్రయత్నం కూడా జరుగుతోందట. ఇందులో భాగంగా రామ్ చరణ్, జగపతి బాబు పాత్రల మధ్య ఉండే కొన్ని కీలకమైన ఎమోషనల్ సన్నివేశాలను కొత్తగా జోడించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న భావోద్వేగ బంధం ప్రేక్షకులకు మరింత బలంగా కనెక్ట్ అవుతుందని, క్లైమాక్స్ ప్రభావం కూడా పెరుగుతుందని భావిస్తున్నారట.

ఈ సమయంలో సినిమా రన్ టైం తగ్గించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టేలా కథనం వేగంగా సాగడం అవసరమని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నెమ్మదిగా సాగిన కొన్ని భాగాలను తొలగించి, మరింత రేసీ నేరేషన్ అందించేందుకు ఎడిటింగ్ టీమ్ పని చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులన్నీ పూర్తయిన తర్వాత సినిమాను మరోసారి సెన్సార్ అనుమతి తీసుకుని కొత్త వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయట.

ఇలా ప్రస్తుతం ప్రదర్శిస్తున్న వెర్షన్ స్థానంలో ఈ అప్‌డేటెడ్ కట్‌ను అప్‌లోడ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే వీకెండ్‌కు ముందే ఈ మార్పులు అమల్లోకి తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్స్ అందుకుంటున్న 'పెద్ది'కి ఈ మార్పులు మరింత బలంగా మారతాయా? సెకండాఫ్‌పై వచ్చిన విమర్శలను తగ్గించి మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయా? లేక ఇప్పటికే మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాపై ఈ మార్పులు పెద్దగా ప్రభావం చూపవా? అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే.. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read more about: ram charan buchi babu sana peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X