Ram Charan's Twins names: రాంచరణ్ కవలలకు నామకరణోత్సం.. ఉపాసన పిల్లల పేర్లు ఏంటో తెలుసా?
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కామినేని కొణిదెల దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మనివ్వడం అభిమానుల్లో కొండంత ఆనందాన్ని నింపింది. జనవరి 31వ తేదీన మగ బిడ్డ, ఆడ బిడ్డతో వారికి సంతాన ప్రాప్తి జరిగింది. . ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ధృవీకరించడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలోహాస్పిటల్ వద్దకు వేలాది సంఖ్యలో అభిమానులు వచ్చి సంబరాలు చేసుకొన్నారు.
మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అయితే ఇటీవలనే డిశ్చార్జితో పండంటి కవలలు మెగా ఇంటిలోకి వచ్చారు. అయితే సంప్రదాయంగా జరిగే నామకరణోత్సవం కార్యక్రమాన్ని ఇటీవల పూర్తి చేశారు. అయితే ఇద్దరు పిల్లలకు మెగా దంపతులు ఏం పేరు పెట్టారనే విషయం ఆసక్తిని పెంచింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఆ చిన్నారుల పేర్ల విషయానికి వస్తే..

మెగా కుటుంబంలోకి కవలల రాకను ఫ్యామిలీ మెంబర్స్‌తోపాటు అభిమానులు ఘనంగా స్వాగతించారు. వారిపై ప్రేమను కురిపిస్తూ బాణాసంచా కాల్చి సంతోషాన్ని పంచుకొన్నారు. పండితుల సూచలు, సలహాలతో ఇటీవల నామకరణోత్సవాన్ని కుటుంబం సభ్యుల సమక్షంలో నిర్వహించారు అని తెలిసింది. ఈ కార్యక్రమానికి కొద్ది మంది ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు, సన్నిహితుల కుటుంబాలు హాజరయ్యారని తెలిసింది.
మెగా కుటుంబంలో ఇటీవల కవలల నామకరణోత్సవం జరిగింది. వారి జాతకం, జన్మనక్షత్రాల ప్రకారం పేర్లు పెట్టారు. కుమారుడికి శివరామ్, కూతురికి అన్వీరా దేవీ అని నామకరణం చేసినట్టు సోషల్ మీడియాలో రాంచరణ్ అభిమానులు ఈ వార్తను షేర్ చేసుకొంటున్నారు. ఈ పేర్లను మెగా కుటుంబం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











