చరణ్ సినిమాలో బన్నీ నటించటం నిజమే
రామ్ చరణ్, అల్లు అర్జున్ కలసి ఓ చిత్రంలో నటిస్తారంటూ వార్తలు రావటం, ఆ తర్వాత ఖండనలు రావటం జరిగిందే.అయితే ఆ ప్రాజెక్టు జరుగుతుందా రూమర్సా అనే సందేహం మెగా అభిమానలలోనే కాక, సాధారణ ప్రేక్షకులలలో కూడా కలిగింది.అయితే ఆ వార్త నిజమేనని, ప్రస్తుతం దానికి సంభందించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. అయితే ఇది మల్టీ స్టారర్ సినిమా కాదట. ఇందులో లీడ్ రోల్ చరణ్‌కేనని, బన్నీ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తాడని తెలిగింది. త్వరలో ఇతర తారాగణాన్ని ఖరారు చేస్తారని చెప్తున్నారు. మరి నిర్మాత ఎవరు..దర్శకుడు ఎవరనేదేగా మీ సందేహం,...ఇక వీరిని ఒకే ఫ్రేంలోకి తీసుకువస్తున్నది ఎవరండీ అంటే.. 'బృందావనం'తో పేరు తెచ్చుకుని, 'మున్నా'తో గుర్తింపు పొందిన వంశీ పైడిపల్లి అని సమాచారం అందింది. వంశీ సిద్ధం చేసిన స్క్రిప్ట్‌ను ఇప్పటికే 'చిరు'త, బన్నీ విని దాదాపు ఓకే చేసేసినట్లు కబురొచ్చింది.పీ ఆర్పీ ఎమ్మల్యే గంటా శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బద్రీనాద్ యాభై రోజుల పంక్షన్ లో ఈ విషయం ఎనౌన్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. రామ్ చరణ్ తో సినిమా గా దీన్ని ప్రమోట్ చేస్తారు.బన్నీ ఓ కీ రోల్ లో నటించి ప్రాజెక్టుకు క్రేజ్ తెస్తారు. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు అంటే రచ్చ తర్వాత జరగవచ్చు అని తెలుస్తోంది. బన్నీ ది చిన్న క్యారెక్టర్ కాబట్టి డేట్స్ కూడా ప్లాబ్లం ఉండదు.దీనికి టైటిల్ మరి చరణ్...అర్జున్ అని పెడతారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











