For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అందాల రాక్షసి’దర్శకుడు నెక్ట్స్ చిత్రం ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'అందాల రాక్షసి' చిత్రంతో దర్శకునిగా మారిన హను రాఘవపూడి మరో చిత్రం కమిటయ్యారు. రామ్ హీరోగా ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా 'షాడో' చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 'షాడో' విడుదలకు ముందే రామ్‌తో నిర్మించే చిత్రం ప్రారంభోత్సవం ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని మెహర్ రమేష్ సెట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

    'అందాల రాక్షసి' చిత్రం ఫెయిలైనా చిత్రం తో టెక్నీషియన్‌గా మంచి పేరు సంపాదించారు హను రాఘవపూడి. దాంతో ఇంప్రెస్ అయిన రామ్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రామ్ హీరోగా రీసెంట్ గా విడుదలైన ఒంగోలు గిత్త చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

    రామ్ ఈ చిత్రంతో పాటు విజయ్ భాస్కర్ దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నారు.వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో 'బోల్‌ బచ్చన్‌' రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. తమాషా కథాంశంతో ఆద్యంతం వినోదాన్ని పంచిపెట్టిన బాలీవుడ్‌ చిత్రం 'బోల్‌ బచ్చన్‌'. వచ్చీ రాని ఆంగ్లంతో అజయ్‌ దేవగణ్‌, ఒక్కడే అయినా ఇద్దరిలా ప్రవర్తించే అభిషేక్‌ బచ్చన్‌ల పాత్రలు భలే నవ్వించాయి. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో పునఃనిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అజయ్‌, అభిషేక్‌ల పాత్రల్లో వెంకటేష్‌, రామ్‌ నటించబోతున్నారు. ఈ చిత్రానికి కె.విజయ భాస్కర్‌ దర్శకత్వం వహించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

    డి.సురేష్‌ బాబు, స్రవంతి రవికిషోర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయి. కథానాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి. బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌ సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు. 'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

    English summary
    
 Buzz Says, Andala Rakshasi director Hanu Raghavapudi will be directing a movie with Young hero Ram. 'Andala Rakshasi' movie has been released recently, though the collections at the box-office are not promising, director Hanu has been appreciated by critics and movie lovers for his work. Hanu has worked as an assistant under Chandrasekhar Yeleti for more than 4 years. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X