Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘అందాల రాక్షసి’దర్శకుడు నెక్ట్స్ చిత్రం ఖరారు
హైదరాబాద్ : 'అందాల రాక్షసి' చిత్రంతో దర్శకునిగా మారిన హను రాఘవపూడి మరో చిత్రం కమిటయ్యారు. రామ్ హీరోగా ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా 'షాడో' చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 'షాడో' విడుదలకు ముందే రామ్‌తో నిర్మించే చిత్రం ప్రారంభోత్సవం ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని మెహర్ రమేష్ సెట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.
'అందాల రాక్షసి' చిత్రం ఫెయిలైనా చిత్రం తో టెక్నీషియన్‌గా మంచి పేరు సంపాదించారు హను రాఘవపూడి. దాంతో ఇంప్రెస్ అయిన రామ్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రామ్ హీరోగా రీసెంట్ గా విడుదలైన ఒంగోలు గిత్త చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
రామ్ ఈ చిత్రంతో పాటు విజయ్ భాస్కర్ దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నారు.వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో 'బోల్ బచ్చన్' రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. తమాషా కథాంశంతో ఆద్యంతం వినోదాన్ని పంచిపెట్టిన బాలీవుడ్ చిత్రం 'బోల్ బచ్చన్'. వచ్చీ రాని ఆంగ్లంతో అజయ్ దేవగణ్, ఒక్కడే అయినా ఇద్దరిలా ప్రవర్తించే అభిషేక్ బచ్చన్ల పాత్రలు భలే నవ్వించాయి. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో పునఃనిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అజయ్, అభిషేక్‌ల పాత్రల్లో వెంకటేష్, రామ్ నటించబోతున్నారు. ఈ చిత్రానికి కె.విజయ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
డి.సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయి. కథానాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి. బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్ సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు. 'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.