మళ్లీ జత కట్టబోతున్న రామ్ - జెనీలియా.. ప్రచారానికి తెరలేపిన రితేష్

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ - జెనీలియా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రెడీ'. 2008లో వచ్చిన ఈ సినిమాను శ్రీను వైట్ల తెరకెక్కించాడు. శ్రీ స్రవంతీ మూవీస్ బ్యానర్‌పై రవి కిశోర్ నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో పాటు కలెక్షన్లను కూడా అదే స్థాయిలో తీసుకొచ్చింది. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందంటూ తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

జెనీలియా తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది. వాటిలో చాలా వరకు హిట్లే ఉన్నాయి. ముఖ్యంగా 'బొమ్మరిల్లు'లో ఆమె చేసిన హాసిని క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తిండిపోతుంది. అలాంటిది రితేష్ దేశ్‌ముఖ్‌తో వివాహం అయిన తర్వాత ఆమె పూర్తిగా సినిమాకు దూరం అయిపోయింది. కానీ, తాజాగా వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఆమె మరోసారి టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం రితేష్ చేసిన ట్వీటే.

Ram Genelia will meet once again

ఆగస్టు 5న జెనీలియా పుట్టినరోజు. దీంతో ఆమె 32వ ఏట అడుగు పెట్టింది. ఈ పుట్టినరోజు వేడుకకు రామ్ హాజరయ్యాడు. ఇందుకోసం అతడు ముంబై వెళ్లాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను రామ్ ట్వీట్ చేశాడు. 'మై స్వీటెస్ట్, క్యూటెస్ట్, బెస్టెస్ట్ జెనీలియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని అందులో పేర్కొన్నాడు. అదే సమయంలో రితేష్ కూడా ముగ్గురు దిగిన ఫొటోను షేర్ చేస్తూ 'ఇస్మార్ట్ శంకర్ రామ్, వెరీ స్మార్ట్ జెనీలియాతో ఇస్మార్ట్ రితేష్ దేశ్‌ముఖ్. ఈ సాయంత్రాన్ని ఎంతో ప్రత్యేకం చేసిన రామ్‌కు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్‌డే జెనీలియా' అని తన పోస్ట్‌ చేశాడు.

అలాగే, రామ్ - జెనీలియా ఇద్దరూ మాత్రమే దిగిన మరో ఫొటోను షేర్ చేస్తూ 'రెడీ 2 ఆల్‌రెడీ' అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో 'రెడీ' సీక్వెల్ వస్తుందని ప్రచారం మొదలైంది. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సీక్వెల్ తీసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రామ్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామా కోసమే ఎదురు చూస్తుండడం దీనికి బలం చేకూర్చుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X