నటుడుగా రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ
ఎప్పుడూ ఏదో సెన్సేషనలైజ్ చేసి వార్తలు కెక్కే రామ్ గోపాల్ వర్మ త్వరలో వెండితెరపై కనిపించి అలరించనున్నారని సమాచారం. ఆయన ప్రియశిష్యుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ కనిపిస్తాడని బాలీవుడ్ లో వినిపిస్తోంది. అయితే అది బిజినెస్ మ్యాన్ హిందీ వెర్షన్ అని చెప్తున్నారు. తెలుగు బిజినెస్ మ్యాన్ లో పూరీ జగన్నాధ్ కనిపించినట్లుగా హిందీలో రామ్ గోపాల్ వర్మ కొద్ది క్షణాలు సేపు కనిపించి తన అభిమానులుకు ఆనందం కలిగిస్తాడంటున్నారు.
ఇక ఇప్పటికే ఆయన దర్శకుడుగానే కాక గాయకుడుగా, పాటల రచయితగా అవతారం ఎత్తారు. అలాగే ఈ చిత్రంలో ఆయన కనిపించటం ద్వారా సినిమాకు హైప్ చేసే అవాకాశం ఉందని చెప్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మని ప్రత్యేకంగా తెరపై చూడటానికి ఎంతమంది ధియోటర్ కి వెళ్తారనేది ఆలోచించాల్సిన విషయం అని బాలీవుడ్ పత్రికలు అంటున్నాయి. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డిపార్టమెంట్ చిత్రం ఫినిషింగ్ టచెస్ లో ఉన్నారు. అన్నీ కలిసివస్తే హిందీలో బిజినెస్ మ్యాన్ ని నిర్మించాలని,అందులోకి రణబీర్ కపూర్ ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











